Punjab: పోలీసుస్టేషన్‌పై రాకెట్ దాడి.. రంగంలోకి ఎన్ఐఏ, రా.. వెలుగు చూసిన సంచలన నిజాలు..
Punjab Police Station Attack: పంజాబ్ లోని తరన్ తరన్ జిల్లా సర్హాలి పోలీసుస్టేషన్‌పై రాకెట్ దాడికి పాల్పడంది తామేనని ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తామే దాడికి పాల్పడినట్టు ఖలిస్తాన్ ఉగ్రవాద నేత గుర్‌ప్రీత్‌సింగ్ పన్నూ ప్రకటించాడు.
పంజాబ్ లోని తరన్ తరన్ జిల్లా సర్హాలి పోలీసుస్టేషన్‌పై రాకెట్ దాడికి పాల్పడంది తామేనని ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తామే దాడికి పాల్పడినట్టు ఖలిస్తాన్ ఉగ్రవాద నేత గుర్‌ప్రీత్‌సింగ్ పన్నూ ప్రకటించాడు. కాగా, రాకెట్ దాడి జరిగిన ప్రాంతాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని గౌరవ్ యాదవ్ తెలిపారు.
ఇదిలాఉంటే.. పంజాబ్ లోని సరిహద్దు జిల్లా తరన్ తరన్‌లోని సర్హాలి పోలీసుస్టేషన్‌పై రాకెట్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం పాక్‌లో చనిపోయిన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్విందర్‌సింగ్ రిండా స్వగ్రామంలోనే ఈ పేలుడు జరిగింది. పాక్ నుంచి వచ్చిన డ్రోన్‌లో సరిహద్దు ప్రాంతానికి పేలుడు పదార్ధాలు తరలించినట్టు గుర్తించారు. పాక్ ఐఎస్‌ఐ ప్రోద్భలంతోనే పోలీసు స్టేషన్‌పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. రాకెట్ దాడి జరిగిన ప్రాంతాన్ని ఆర్మీతో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు పరిశీలించాయి.
ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. రాకెట్ దాడిలో పోలీసుస్టేషన్ పాక్షికంగా ధ్వంసమయ్యింది. కొద్దిరోజుల క్రితం పంజాబ్ పోలీసుల ఇంటెలిజెన్స్ కార్యాలయంపై కూడా రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఇక సరిహద్దు జిల్లాలో పోలీసుస్టేషన్‌పై రాకెట్ దాడి ఘటనను కేంద్రం కూడా సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌ఐఏతో పాటు రా కూడా రంగంలోకి దిగాయి.
इधर उधर की बात मत कर बात कर पंजाब में लॉ एंड आर्डर का जनाजा क्यों निकला देख पंजाब में राकेट लांचर अटैक क्यों हो रहे है? @BhagwantMann @ArvindKejriwal pic.twitter.com/dlWRXAJmCS
— Bikram Singh Majithia (@bsmajithia) December 10, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..