ఛీ ఛీ.. మరీ ఇంత దారుణమా?.. అనారోగ్యంతో ఉన్న భర్తను ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే..

Extra Marital affairs: రోజు రోజుకు మనుషులు ఆలోచనలు మరింత క్రూరంగా తయారువుతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు.. వ్యక్తుల ప్రాణాలను మింగేందుకు ఉసిగొల్పుతున్నాయి. తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది.

ఛీ ఛీ.. మరీ ఇంత దారుణమా?.. అనారోగ్యంతో ఉన్న భర్తను ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే..
Illegal Relationship
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 10, 2022 | 12:42 PM

రోజు రోజుకు మనుషులు ఆలోచనలు మరింత క్రూరంగా తయారువుతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు.. వ్యక్తుల ప్రాణాలను మింగేందుకు ఉసిగొల్పుతున్నాయి. తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పాడి.. అనారోగ్యంగా ఉన్న భర్తను అత్యంత క్రూరంగా హతమార్చింది ఓ వివాహిత. అసలు తనపై సందేహమే రాకుండా ఉండేందుకు పకడ్బందీ ప్లాన్ వేసుకుని, దానిని పక్కాగా అమలు చేసి ఉసురు తీసింది ఆ మహా ఇల్లాలు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కాన్పూరులోని స్థానిక కల్యాణ్‌పూర్ శివ్లీ రోడ్డు ప్రాంతానికి చెందిన రిషభ్, సప్నా దంపతులు. వీరిద్దరూ నవంబర్ 27న ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో రిషబ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి చేరి చికిత్స తీసుకున్నాడు. డిసెంబర్ 1వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, అలా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ రెండు రోజులకే రిషబ్ ప్రాణాలు కోల్పోయాడు. అనారోగ్యం వల్లే చనిపోయాడని భావించారంతా. కానీ, పోలీసులు ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

భార్య సప్నా తనకేమీ తెయదన్నట్లు నటిస్తూ.. తననెవరూ గుర్తుపట్టరనే ధీమాతో పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇంకేముందు.. పోలీసుల తమ స్టైల్లో ఎంక్వైరీ చేయగా.. అసలు గుట్టు బయటపడింది. అమ్మగారి వ్యవహారం అంతా బహిర్గతమైంది. ప్రియుడిపై మోజు, ఆస్తి దక్కదేమో అన్న అక్కసుతో.. కట్టుకున్న భర్తకు మెడిసిన్ ఓవర్ డోస్ ఇచ్చి హతమార్చేసింది. ఇదే విషయాన్ని విచారణలో పోలీసులు నిర్ధారించారు. ఔషదాలు ఎక్కవ మోతాదులో ఇవ్వడం వల్ల అవయవాలు తెబ్బతిని, రిషబ్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

అయితే, అతని మరణానికి కారణంతోపాటు.. కారకులను కూడా గుర్తించారు పోలీసులు. కడవరకు తోడుంటుందని విశ్వసించి వివాహం చేసుకున్న భార్యే తన భర్తను కాటికి పంపిందని తేల్చారు ఖాకీలు. ఇంతటి దురాగతానికి పాల్పడటానికి వివాహేతర సంబంధమే కారణం అని గుర్తించారు. ప్రియుడు రాజుపై ఉన్న మోజు, భర్త తన పేరిట ఆస్తి రాయడేమో అన్న అనుమానం ఆమెను ఈ గాతుకానికి ఉసిగొల్పాయి. ప్రియుడు రాజుతో కలిసి, క్రైమ్ సీరియల్స్ చూసి.. వాటి ప్రేరణతో ఇలా మెడిసిన్ డోస్ అధికంగా ఇచ్చే నిండుప్రాణాన్ని పొట్టనపెట్టుకుంది. ఆమె ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్ చెక్ చేయగా ఇవన్నీ బయటపడ్డాయి. రాజు, సప్నాను అదుపులోకి తీసుకుని విచారించగా.. తమ నేరాన్ని అంగీకరించారు. దాంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..