Bhoganandishwara Temple: జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం.. అందంగా ముస్తాబవుతున్న ఆలయాలు, స్మారక చిహ్నాలు

భారత దేశం తన సంస్కృతి, సాంప్రదాయాలతో ప్రపంచ గురువుగా మారుతుంది. వచ్చే ఏడాది జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇవ్వనున్నది. దేశంలోని అన్ని స్మారక చిహ్నాలు ఈ వేడుకలకు సాక్ష్యంగా నిలవనున్నాయి.

Surya Kala

|

Updated on: Dec 10, 2022 | 12:16 PM

భారత దేశం తన సంస్కృతి, సాంప్రదాయాలతో ప్రపంచ గురువుగా మారుతుంది. వచ్చే ఏడాది జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇవ్వనున్నది. దేశంలోని అన్ని స్మారక చిహ్నాలు ఈ వేడుకలకు సాక్ష్యంగా నిలవనున్నాయి.  జీ20 సదస్సు నేపథ్యంలో అనేక స్మారక చిహ్నాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. వాటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు.

1 / 7
2023లో జి20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్‌కు దక్కింది. ఈ కార్యక్రమం బెంగళూరులో జరగనుంది. ఈ కారణంగానే దేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన.. యునెస్కో జాబితాలో ఉన్న ఆలయాలకు ప్రత్యేక లైటింగ్ ను ఏర్పాటు చేశారు.

2 / 7
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నందిగిరి దేవాలయం దిగువన ఉన్న చారిత్రాత్మక శ్రీ భోగానందేశ్వర దేవాలయం కలర్ పుల్ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ ఆలయ దీపాలంకరణ చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది.

3 / 7
ఆలయంలోని అరుణాచలేశ్వరుడు, భోగనందీశ్వర్‌ గోపురాలతోపాటు లోపలి ప్రాంగణానికి కలర్‌ పుల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు.

4 / 7

భోగనందీశ్వర ఆలయ గోడలు, మందిరం, మండపం, ప్రాంగణంలోని అన్ని ఆలయాలు, ఆరుబయట స్మారక చిహ్నాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

5 / 7
రంగురంగుల లైటింగ్‌లో ఆలయ శిల్పకళా సౌందర్యం డ్రోన్ కెమెరాలో బంధించబడింది. ఈ ఆలయ సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని కామెంట్ చేస్తున్నారు అంతేకాదు.. ఇప్పుడు ఏర్పాటు చేసిన లైటింగ్‌ను ఏడాది పొడవునా కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. 

6 / 7
సమ్మిట్‌లోని సభ్యదేశాల ప్రముఖులు ఆలయాలను, స్మారక చిహ్నాలను సందర్శించే వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ గొప్ప వారసత్వం,  గొప్ప చరిత్రను తెలిసేలా ఆలయం అందంగా కనువిందు కలిగించేలా అలంకరించారు.

7 / 7
Follow us