Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mister India Coat : విఠలాచార్య సినిమా చూపిస్తున్న విద్యార్థులు.. ఈ కోటు వేసుకుంటే మాయం అవుతారట

ప్రత్యేక కోటుని తయారు చేశాడు ఓ విద్యార్థి.  ఈ కోటు ధరించిన వారేవరైనా సరే.. మూడోకంటికి చిక్కకుండా అదృశ్యమవుతారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే..

Mister India Coat : విఠలాచార్య సినిమా చూపిస్తున్న విద్యార్థులు.. ఈ కోటు వేసుకుంటే మాయం అవుతారట
Mister India Coat
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 10, 2022 | 12:08 PM

మీరు బాలీవుడ్ మూవీ ‘మిస్టర్ ఇండియా‘ చూసే ఉంటారు. చిన్నప్పుడు ఈ సినిమా చూసి మనం కూడా ఇలాగే మాయమైపోతే ఎంతబాగుండునూ అని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు మీ కోరిక తీరబోతోంది. ఎందుకంటే మిస్టర్ ఇండియా లాగా మిమ్మల్ని కనిపించకుండా మాయం చేసే ప్రత్యేకమైన కోటు కనిపెట్టబడింది. చైనాలోని కొందరు విద్యార్థులు ఈ ప్రత్యేకమైన మిస్టర్ ఇండియా కోట్‌ను సృష్టించారు. ఈ కోటు వేసుకున్నాక మీరు కెమెరా కంటపడకుండా మాయమైపోతారట.

చైనా వివిధ పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు చైనాలో ఓ విద్యార్థి చేసిన ఈ పరిశోధన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చైనీస్ విద్యార్థుల కోసం ప్రత్యేక కోటుని తయారు చేశాడు ఆ విద్యార్థి.  ఈ కోటు ధరించిన వారేవరైనా సరే.. మూడోకంటికి చిక్కకుండా ఉంటారట. అంటే, భద్రత కోసం ఏర్పాటు చేసే  నిఘా కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోవచ్చట. ఈ కోటు వేసుకున్నప్పుడు మీరు కెమెరాలో కనిపించలేరు. ఈ కోటు ధరించిన వ్యక్తి కెమెరా నుండి అదృశ్యమయ్యాడు. అయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే..ఈ కోటు సాధారణ కోటు వలెనే కనిపిస్తుంది. కానీ, వేసుకున్న వారిని మాత్రం కెమెరా నుంచి తప్పిస్తుంది.  ఇక ఈ కోటు ధర గురించి చెప్పాలంటే ఈ కోటు ధర రూ. 6000 వరకు ఉంటుంది. కానీ, కొన్ని కారణాలతో ఈ కోట్ నిషేధించే అవకాశం ఉంది.

ఈ ప్రత్యేక కోటు పేరు ఇన్విస్ డిఫెన్స్. మీ శరీరంపై ఈ కోటు ధరించడం ద్వారా మీరు అన్ని భద్రతా కెమెరాల నుండి తప్పించుకోవచ్చు. కానీ, AI గూఢచార కెమెరాల నుండి తప్పించుకోవచ్చు. ఈ కోటు ధరించడం ద్వారా మీరు AI ఇంటెలిజెన్స్ కెమెరా దృష్టి నుండి మాయవుతారు. AI ఇంటెలిజెన్స్ కెమెరాల ఆధారంగా నిఘా ఉండే దేశాల పౌరులకు ఈ కోట్ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చైనా ప్రభుత్వం దీన్ని నిషేధించే అవకాశం ఉంది. Huawei Technologies నిర్వహించిన పోటీలో InvisDefense కోట్ కూడా బహుమతిని గెలుచుకుంది. చైనా మీడియా ప్రకారం, ఇన్విస్ డిఫెన్స్ కోట్ మెషిన్ విజన్ AI అల్గారిథమ్‌ను తప్పించుకుందని ఒక నివేదిక పేర్కొంది. ఈ కోటు సెక్యూరిటీ కెమెరాలోని నైట్ టైమ్ బాడీ హీట్ సెన్సార్ మాడ్యూల్‌ను కూడా గందరగోళానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే, ఈ ఇన్విస్ డిఫెన్స్ కోటును చైనా ప్రభుత్వం నిషేధించే అవకాశం ఉంది. లేదా ఈ కోటు మిలిటరీకి ఉపయోగపడే అవకాశం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి