Indian Migration: స్వదేశం వద్దు.. విదేశాలే ముద్దు.. భారీ సంఖ్యలో పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు..
ఆయా దేశాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేస్కుని ఆయా దేశాల పౌరసత్వం పొందుతున్నారు. గత కొన్నేళ్లుగా పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఎక్కడోచోట ఏదొక ప్లేస్ లో భారతీయులు కనిపిస్తారని అంటారు. విద్య, ఉద్యోగం, ఉపాధి ఇలా రకరకాల కారణాలతో దేశాన్ని వదిలి ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే ఇలా వెళ్లిన భారతీయులు చాలామంది విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆయా దేశాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేస్కుని ఆయా దేశాల పౌరసత్వం పొందుతున్నారు. గత కొన్నేళ్లుగా పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఐదేళ్లలో లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ప్రకటించారు.
గత ఐదేళ్లలో 1.83 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ అందించిన సమాచారం ప్రకారం.. 2022 అక్టోబర్ 31 వరకు గత ఐదేళ్లలో కనీసం 1,83,741 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 2016లో 1,31,489 లు ఉండగా.. 2017 ఏడాదిలో 1,41,603కాగా 2018 లో 1,33,049లకు చేరుకుంది. 2019లో 1,34,561 కాగా, 2020లో 1,44,017ల మంది ఉండగా.. 2021లో 1,63,370 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని భారత ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అంటే 2017లో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 1,41,603 కాగా.. ఐదేళ్ల తర్వాత 2022 అక్టోబర్ 31 నాటికి 1,83,741కి పెరిగింది.
అంతేకాదు గత కొన్నేళ్లుగా భారత పౌరసత్వం తీసుకున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ మినహా విదేశీ పౌరుల సంఖ్య గురించి కూడా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానం తెలియజేశారు. ఇతర దేశాలనుంచి 2015లో 93, 2016లో 153 , 2017లో 175 , 2018లో 129, 2019లో 113 , 2020లో 27, 2021లో42 కాగా 2022లో 60మంది విదేశీ పౌరులు భారత పౌరసత్వం తీసుకున్నారని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..