Hypersonic Vehicle: ధ్వని వేగం కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్‌సోనిక్ వాహనం ట్రయల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం
ఈ హైపర్‌సోనిక్ వాహనం అన్నిరకాల పారామీటర్స్‌ను చేధించిందని ప్రకటించారు అధికారులు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇలాంటి టెక్నాలజీని సాధించిన దేశంగా భారత్ నిలిచింది.
భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. ఇది అస్త్రం మాత్రమే కాదు.. అంతకు మించి. ఇప్పటివరకు మూడు దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ.. ఇప్పుడు భారత్ డెవలెప్‌చేసింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ సంయుక్తంగా హైపర్‌సోనిక్ వెహికల్ టెస్ట్ నిర్వహించింది. ఈ ట్రయల్స్ సక్సెస్ కావడంతో భారత్ రక్షణ రంగం మరింత పటిష్టం కానుంది. హైపర్‌సోనిక్ వాహనం పాకిస్థాన్, చైనాల కుయుక్తులను తిప్పికొట్టేందుకు ఇదో ముఖ్యమైన ఆయుధంగా మారుతుంది. ఈ వాహనం ప్రత్యేకత ఏమిటంటే ఇది ధ్వని వేగం కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.
దేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తొలిసారిగా హైపర్ సోనిక్ వాహన ట్రయల్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఇందుకోసం ఇస్రోతోపాటు.. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కలిసి సంయుక్త హైపర్‌సోనిక్ వెహికల్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించామని ఇస్రో ప్రకటించింది. ఈ హైపర్‌సోనిక్ వాహనం అన్నిరకాల పారామీటర్స్‌ను చేధించిందని ప్రకటించారు అధికారులు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇలాంటి టెక్నాలజీని సాధించిన దేశంగా భారత్ నిలిచింది. ఈ హైపర్‌సోనిక్ వాహనం శబ్ద వేగం కన్నా నాలుగు రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. మాక్ 4 వాహనం కన్నా స్పీడ్. ఈ వాహనాన్ని ఎయిర్‌ప్లేన్‌గా, మిస్సైల్ వాహనంగా, స్పేస్‌క్రాఫ్ట్‌గానూ ఉపయోగించవచ్చని చెబుతోంది ఇస్రో. ఈ వాహనాన్ని క్షణాల్లోనే సిద్ధం చేసి.. సెకన్లలో లక్ష్యాలను చేధించేలా చేయగలం. న్యూక్లియర్ పేలోడ్స్‌ని సైతం నిర్ణీత లక్ష్యాలపై వేయగల సామర్ధ్యం దీని సొంతం.
@ISRO and JSIIC @HQ_IDS have jointly conducted Hypersonic vehicle trials.
The trials achieved all required parameters and demonstrated Hypersonic vehicle capability.@adgpi@IAF_MCC@indiannavyMedia
— ISRO (@isro) December 9, 2022
అయితే ఈ హైపర్‌సానిక్ వాహనాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి మరో మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని ఇస్రో, IDS ఇండియా ప్రకటించాయి. హైపర్‌సానిక్ వాహనం భారత స్పేస్ గతినే మార్చగలదని భావిస్తున్నారు నిపుణులు. హైపర్‌సానిక్ వాహనాలను అమెరికా 1949 నుంచే వాడుతోంది. వాటిని అప్‌గ్రేడ్ చేసుకుంటూ వస్తోంది. రష్యా 1961లో తొలి హైపర్‌సానిక్ వెహికల్‌ను తయారుచేసింది. రష్యా టెక్నాలజీ వాడుకుని చైనా 2018లో తయారుచేసింది. ఇప్పుడు భారత్ వాటి సరసన చేరి రికార్డు సృష్టించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..