Jallikattu: ఈ ఏడాది జల్లి కట్టు నిర్వహణపై సందిగ్దత.. నిషేధం విధించాలంటున్న పెటా.. తమ సంప్రదాయాన్ని వేరుచేస్తే ఊరుకోమంటున్న తమిళులు

మాములుగా అయితే ఈ సరికే ఇక్కడ జల్లికట్టు పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలై పోతాయి. జనవరి మొదటి వారం నుంచి మార్చి చివరి వరకూ దక్షిణ తమిళనాడులో ఎటు చూసినా జల్లికట్టు సందడే. ఈ సారికి సుప్రీం వాదనలు కొనసాగుతుండటంతో.. ఎక్కడి ఏర్పాట్లు అక్కడే స్థంభించిపోయాయి.

Jallikattu: ఈ ఏడాది జల్లి కట్టు నిర్వహణపై సందిగ్దత.. నిషేధం విధించాలంటున్న పెటా.. తమ సంప్రదాయాన్ని వేరుచేస్తే ఊరుకోమంటున్న తమిళులు
Jallikattu In Tamilnadu
Follow us

|

Updated on: Dec 08, 2022 | 6:51 AM

సంక్రాంతి పండగ వస్తుంటే చాలు.. అందరికి ముందుగా గుర్తుకొచ్చేవి.. సంస్కృతి, సంప్రాదయాలు.. ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు, తమిళనాడులో జల్లి కట్టు.. అవును తమిళనాడు అంటేనే జల్లికట్టు ఫేమస్. సంక్రాంతి సందర్భంగా తమిళనాట జల్లికట్టు సందడి కనిపిస్తుంది. కానీ ఈ సారికి జల్లికట్టు నిర్వహణ ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్ నడుస్తోంది. కారణాలేంటి?

తమిళనాట జల్లికట్టు ఒక సంప్రదాయ క్రీడ. తమనూ తమ సంప్రదాయాన్ని వేరు చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదంటారు తమిళులు. జల్లికట్టే లేకుంటే ఎద్దుల్లో ఒక జాతి మొత్తం అంతరిస్తుందని చెప్పుకొస్తారు. అంతే కాదు జల్లికట్టు ఎద్దులను నిర్వాహకులు తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారని… చెబుతోంది తమిళనాడు ప్రభుత్వం. అయితే ఈ వాదనలతో ఏకీభవించరు.. జంతు ప్రేమికులు. జల్లికట్టులో ఎద్దులను అత్యంత దారుణంగా హింసిస్తారనీ. ఇది నేరమంటుంది పెటా. 2014లో జల్లికట్టు, బండ్ల పోటీల్లో ఎద్దులను ఉపయోగించారాదని తీర్పునిచ్చింది సుప్రీం. ఈ తీర్పును తిరిగి అమలు చేయాలని వాదిస్తోంది పెటా. అందులో భాగంగా ఏడేళ్ల క్రితంనాటి పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయ్.

గతంలో అంటే 2016లో జల్లికట్టు నిషేధాజ్ఞలపై మెరీనా బీచ్ ఉద్యమం జరగ్గా.. 1960నాటి జంతు హింస- నిరోధక చట్టం సవరించి అత్యవసర చట్టం చేయాల్సి వచ్చింది నాటి పన్నీర్ సెల్వం ప్రభుత్వం. 2017 నుంచీ దక్షిణ తమిళనాడు జిల్లాలైన మధురై, దిండిగల్, పుదుకోట్టై, శివగంగై, తిరుచ్చి లో జల్లికట్టు పోటీలు యధేచ్చగా సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మాములుగా అయితే ఈ సరికే ఇక్కడ జల్లికట్టు పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలై పోతాయి. జనవరి మొదటి వారం నుంచి మార్చి చివరి వరకూ దక్షిణ తమిళనాడులో ఎటు చూసినా జల్లికట్టు సందడే. ఈ సారికి సుప్రీం వాదనలు కొనసాగుతుండటంతో.. ఎక్కడి ఏర్పాట్లు అక్కడే స్థంభించిపోయాయి.

తమిళనాడు ప్రభుత్వం తో పాటు జల్లికట్టు నిర్వహణ కమిటీ కూడా కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ పోటీలు పూర్తి భద్రతా ప్రమాణాలతో జరుగుతాయనీ. ఎద్దులకు, వీరులకు పూర్తి వైద్య పరీక్షలు చేసిన తర్వాతే.. పోటీలు నిర్వహిస్తామనీ అంటారు. అంతే కాదు కోర్టు చేసే సూచనలు సైతం తాము పాటించడానికి సిద్ధమని అంటున్నారు. ఇప్పటికే తాము కోర్టు నిబంధనల ప్రకారం.. పోటీలను నిర్వహిస్తున్నామనీ.. మీరింకేదైనా సలహా సూచనలిస్తే వాటిని కూడా అమలు చేస్తామన అంటున్నారు నిర్వాహకులు. పోటీలకు సమయం దగ్గర పడుతోంది కాబట్టి.. నిషేధం విధించకుండా అనుమతించాలని తమ వాదనలు వినిపిస్తోంది స్టాలిన్ సర్కార్. మరి ఈ పోటీల నిర్వహణ పై సుప్రీం ధర్మాసనం ఏం తీర్పునిస్తుందన్న ఉత్కంఠ చెలరేగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..