UP News: వరుడు కోసం ఎదురుచూస్తున్న వధువు.. పెళ్లి మండపానికి చేరుకోవాల్సిన మంత్రి తనయుడు ఆస్పత్రి పాలు.. రీజన్ ఏమిటంటే..

వధువు పెళ్లి మండపంలో వరుడి కోసం ఎదురుచూస్తోంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఊరేగింపు వచ్చిన సమాచారం వధువు కుటుంబ సభ్యులకు అందకపోవడంతో వధువు తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. దీంతో మంత్రి ధరంబీర్ ప్రజాపతికి ఫోన్ చేశారు.

UP News: వరుడు కోసం ఎదురుచూస్తున్న వధువు.. పెళ్లి మండపానికి చేరుకోవాల్సిన మంత్రి తనయుడు ఆస్పత్రి పాలు.. రీజన్ ఏమిటంటే..
Uttar Pradesh Minister Son hospitalised
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2022 | 12:35 PM

ఓ వైపు వరుడు పెళ్లివేదిక వద్దకు చేరుకుని తనకోసం పెళ్లిమండపంలో ఎదురు చూస్తున్న వధువు మెడలో వరమాల వేయాల్సింది ఉంది.  మరో వైపు ఆ వరుడు కోసం వధువు.. ఆహుతులు ఎదుచూస్తున్నారు.. అయితే ఇంతలో వరుడు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి అకస్మాత్తుగా ఆగిపోయింది. అది కూడా మంత్రి గారి కుమారుడు పెళ్లి ఆగిపోవడంతో ప్రస్తుతం ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ సంఘటన  ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నివసిస్తున్న జైళ్లశాఖ మంత్రి ధరంబీర్ ప్రజాపతి కుమారుడి పెళ్లి ఊరేగింపు జరగాల్సి ఉంది. అయితే ఇంతలో పెళ్ళికొడుక్కి  డెంగ్యూ సోకింది అని తేలడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మరోవైపు వధువు .. బంధువులు పెల్లుకొడుకు ఊరేగింపుతో పెళ్లి మండపానికి చేరుకోకపోవడంతో  కలకలం రేగింది. కారణం తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు మంత్రికి ఫోన్ చేయగా అసలు విషయం తెలిసింది. పెళ్లిని ప్రస్తుతానికి వాయిదా వేశారు.  తన కొడుకు ఆరోగ్యంగా ఉంటేనే పెళ్లి చేస్తానని మంత్రి ధరంబీర్ చెప్పారు.  ప్రస్తుతం పెళ్ళికొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.

ఆగ్రా జైలులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధరంబీర్.. పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజీబిజీగా తన కుమారుడు ఉన్నాడని.. అయితే తన కుమారుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని చెప్పారు. కొడుకు చాలా రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే పెళ్లి ముహర్తం దృష్టిలో పెట్టుకుని తన కొడుకు జ్వరం విషయం ఎవరికీ చెప్పలేదని.. సమీపంలోని మందుల షాపులో మెడిసిన్స్ తీసుకున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఊరేగింపు డిసెంబర్ 2వ తేదీన జరగాల్సి ఉంది. ఇంట్లో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో పెళ్లి కొడుకు ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే పెళ్లి కొడుకుని సికంద్రాలోని జాతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసియులో ఉంచి చికిత్సనందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఊరేగింపు రాకపోవడంతో కలకలం: వధువు ఇంట్లో ఊరేగింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధువు పెళ్లి మండపంలో వరుడి కోసం ఎదురుచూస్తోంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఊరేగింపు వచ్చిన సమాచారం వధువు కుటుంబ సభ్యులకు అందకపోవడంతో వధువు తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంది. దీంతో మంత్రి ధరంబీర్ ప్రజాపతికి ఫోన్ చేశారు. అప్పుడు పెళ్లికొడుకు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. దీంతో వధువు తరఫు వారు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.

మీడియాను తప్పించుకున్న ఇరువర్గాలు  ఈ విషయం తెలియగానే మీడియా వారు కూడా చేరుకున్నారు. ఇరువర్గాలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఇరువర్గాల ప్రజలు ఈ విషయంలో మీడియాను తప్పించుకున్నారు. అయితే అంతకుముందు జైలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కుమారుడికి డెంగ్యూపై సమాచారం అందించారు. ఖైదీల కార్యక్రమం వల్ల తాను జైలుకు వచ్చానని, అయితే తన కొడుకు పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..