AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Bill: వృద్ధురాలికి షాక్ ఇచ్చిన కరెంట్‌ బిల్లు.. ఏకంగా రూ.21 లక్షలు.. బిల్లు కట్టాలంటే ఇల్లు అమ్ముకోవాలంటూ నిరసన ఎక్కడంటే..

రాష్ట్రం పానిపట్‌ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల సుమన్‌ 60 ఏళ్లుగా తన ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ ఆమెకు షాక్‌ ఇచ్చింది. ఏకంగా 21 లక్షల 89 వేల రూపాయల కరెంటు బిల్లును ఆమెకు అందజేసింది.

Electricity Bill: వృద్ధురాలికి షాక్ ఇచ్చిన కరెంట్‌ బిల్లు.. ఏకంగా రూ.21 లక్షలు.. బిల్లు కట్టాలంటే ఇల్లు అమ్ముకోవాలంటూ నిరసన ఎక్కడంటే..
Haryana Woman Electricity B
Surya Kala
|

Updated on: Dec 01, 2022 | 4:33 PM

Share

ఓ వృద్ధురాలికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. వందలు కాదు.. వేలు కాదు ఏకంగా లక్షల్లో బిల్లు వేసి షాక్‌కు గురిచేసింది. బిల్లును చూసి ఒక్కసారిగా కంగుతిన్న ఆ వృద్ధురాలు వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రం పానిపట్‌ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల సుమన్‌ 60 ఏళ్లుగా తన ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ ఆమెకు షాక్‌ ఇచ్చింది. ఏకంగా 21 లక్షల 89 వేల రూపాయల కరెంటు బిల్లును ఆమెకు అందజేసింది. అది చూసిన ఆమె ఒక్కసారిగా కంగుతింది.  దీన్ని సరిచేయాలని వృద్ధురాలు పలుమార్లు విద్యుత్ శాఖను సందర్శించినా ఇప్పటి వరకు సరిదిద్దలేదు. తన వద్ద ఇంత మొత్తంలో బిల్లు కట్టడానికి డబ్బులు లేవని విద్యుత్ శాఖకు చెప్పింది. అయినప్పటికీ బిల్లును సరిదిద్దలేదు.

ఈ క్రమంలోనే వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. బిల్లు రిసిప్ట్‌తో పాటు ఓ బ్యానర్‌ను పట్టుకుని విద్యుత్‌ శాఖ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ బ్యాండ్‌ వాయిస్తూ.. మిఠాయిలు పంచి మరీ నిరసన వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ బ్యానర్‌లో ఏం రాసుందో తెలుసా.. ‘ఇంత బిల్లు నేను కట్టలేను, అందుకే నా ఇంటిని అమ్మాలనుకుంటున్నాను. బిల్లు కిందకు ఈ ఇంటిని మీరే తీసుకోండి” అని రాసిఉంది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా, 2019లోనూ సుమన్‌కు 12 లక్షల విద్యుత్ బిల్లు వచ్చిందంట. అయితే గత నెలలోనే ఆ బిల్లు మొత్తం చెల్లించినట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వచ్చిన బిల్లును తాను చెల్లించలేనని వాపోయింది. బిల్లు కట్టాలంటే తన ఇల్లు విక్రయించడం ఒక్కటే మార్గమని ఆవేదన వ్యక్తం చేసింది. సుమన్ తన 60 గజాల ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. మిట్టల్ ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..