Delhi AIIMS: ఎయిమ్స్ లో 6 రోజులుగా నిలిచిన సర్వర్.. హ్యాకర్లు 200 కోట్ల క్రిప్టోకరెన్సీ డిమాండ్.. కాగితం, పెన్నులకు పనిచెప్పిన సిబ్బంది

సర్వర్ డౌన్‌, సైబర్ దాడుల భయం నేపథ్యంలో ఆస్పత్రిలో ఒకప్పటిలా రోజులకు సేవలను అందించేందుకు వైద్య సిబ్బంది పేపర్, పెన్నులను ఆశ్రయించారు. ఎమెర్జెన్సీ కేసులు, ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్,  లేబొరేటరీ విభాగాలలో పేషెంట్ కేర్ సేవల సహా అన్ని వైద్య సేవలను మాన్యువల్‌గా  పేపర్, పెన్నులను సహాయంతో  నిర్వహిస్తున్నామని  సంబంధిత వర్గాలు తెలిపాయి.

Delhi AIIMS: ఎయిమ్స్ లో 6 రోజులుగా నిలిచిన సర్వర్.. హ్యాకర్లు 200 కోట్ల క్రిప్టోకరెన్సీ డిమాండ్.. కాగితం, పెన్నులకు పనిచెప్పిన సిబ్బంది
Delhi Aiims Server Down
Follow us

|

Updated on: Nov 28, 2022 | 8:59 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) సర్వర్ సోమవారం వరుసగా 6వ రోజు కూడా పనిచేయలేదు. సర్వర్ డౌన్‌ కావడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో సర్వర్‌ను హైజాక్ చేసిన హ్యాకర్లు క్రిప్టోకరెన్సీ రూపంలో రూ.200 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హ్యాకర్లు ఈ డిమాండ్‌ను మెయిల్ ద్వారా ఎయిమ్స్‌కు పంపినట్లు సమాచారం. తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే సర్వర్‌ను సరిదిద్దబోమని, సర్వర్‌ డౌన్‌ అవుతుందని బెదిరించినట్లు తెలుస్తోంది.

దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సర్వర్ డౌన్.. హ్యాకర్ల బెదిరింపులపై దర్యాప్తు ప్రారంభించారు. లింక్‌కు లింక్‌ని జోడించడం ద్వారా హ్యాకర్ల కాలర్‌ను చేరుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బెదిరింపుకి పాల్పడిన మెయిల్ ఐపీ అడ్రస్‌ను కూడా ట్రాక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సర్వర్ డౌన్‌, సైబర్ దాడుల భయం నేపథ్యంలో ఆస్పత్రిలో ఒకప్పటిలా రోజులకు సేవలను అందించేందుకు వైద్య సిబ్బంది పేపర్, పెన్నులను ఆశ్రయించారు. ఎమెర్జెన్సీ కేసులు, ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్,  లేబొరేటరీ విభాగాలలో పేషెంట్ కేర్ సేవల సహా అన్ని వైద్య సేవలను మాన్యువల్‌గా  పేపర్, పెన్నులను సహాయంతో  నిర్వహిస్తున్నామని  సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

సైబర్ దారుల విషయంపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు నిరంతరం పనిచేస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విచారణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కూడా పాలుపంచుకున్నట్లు అధికారులు చెప్పారు.

ఇ-హాస్పిటల్ కోసం NIC ఇ-హాస్పిటల్ డేటాబేస్ , అప్లికేషన్ సర్వర్లు పునరుద్ధరించబడ్డాయి. NIC బృందం AIIMSలో ఉన్న ఇతర ఇ-హాస్పిటల్ సర్వర్‌ల వైరస్ లను స్కాన్ చేసి శుభ్రపరుస్తుంది. ఇవి ఆసుపత్రి సేవలను అందించడానికి అవసరమైనవని తెలుస్తోంది. ఇ-హాస్పిటల్ సేవలను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన నాలుగు సర్వర్లు డేటాబేస్‌లు, అప్లికేషన్‌ల కోసం స్కాన్ చేసి రెడీ చేశారు. అలాగే, AIIMS నెట్‌వర్క్ పునరుద్ధరణ వేగవంతంగా చేస్తున్నారు. సర్వర్‌లు, కంప్యూటర్‌ల నిర్వహణ కోసం యాంటీవైరస్ ను ఇన్ స్టాల్ చేస్తున్నారు. ఆసుపత్రిలోని 5,000 కంప్యూటర్లలో దాదాపు 1,200 కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేయబడింది. 50 సర్వర్‌లలో ఇరవై స్కాన్ చేయబడ్డాయి. ఈ పనులన్నీ రోజంతా కొనసాగుతాయని అధికారులు చెప్పారు. ఇ-హాస్పిటల్ సేవలను ఐదు రోజు తర్వాత దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారని పేర్కొన్నారు.

AIIMS సర్వర్‌కు క్రిప్టో కనెక్షన్ ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్ నిలిచి దాదాపు 6 రోజులు అయింది. ఇ-హాస్పిటల్ సర్వర్ పనిచేయకపోవడంతో..  OPDతో సహా అనేక సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాస్తవానికి..  సైబర్ దాడి చేసిన అనంతరం.. హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు 200 కోట్ల క్రిప్టోకరెన్సీని డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు హ్యాకర్లు క్రిప్టోకరెన్సీని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.

వర్చువల్ లేదా క్రిప్టో కరెన్సీ ఎలా పని చేస్తుందంటే?

క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీని డిజిటల్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. ఈ కరెన్సీ ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ సహాయంతో ఉత్పత్తి చేయబడి ఆపై నియంత్రించబడుతుంది. ఈ రకమైన కరెన్సీని ప్రపంచంలోని ఏ సెంట్రల్ బ్యాంక్  గుర్తించలేదు.. అదే విధంగా ఈ కరెన్సీని ఏ సెంట్రల్ బ్యాంక్ నియంత్రిచదు.  ఈ రకమైన కరెన్సీపై ఏ దేశానికి చెందిన స్టాంప్ ఉండదు. డాలర్ విలువ అమెరికా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. అయితే బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీకి స్వంత విలువ లేదు. ఇది బెట్టింగ్ కోసం ఉపయోగించబడుతుంది. దీని ఆధారంగా దాని ధర హెచ్చుతగ్గులకు గురవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు