Vehicle Scrappage Policy: ఇక నుంచి అలాంటి వాహనాలకు రోడ్లపై నో ఎంట్రీ.. కేంద్రం మరో సంచలన నిర్ణయం

వాహనాల విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది..

Vehicle Scrappage Policy: ఇక నుంచి అలాంటి వాహనాలకు రోడ్లపై నో ఎంట్రీ.. కేంద్రం మరో సంచలన నిర్ణయం
Vehicles
Follow us

|

Updated on: Nov 28, 2022 | 8:04 PM

వాహనాల విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పాత వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో గడువు తీరిన వాహనాలను స్క్రాప్‌గా మార్చేలా ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు పలు నివేదికలు వెల్లడవుతున్నాయి. దేశంలో కాలుష్యం పెరిగిపోతుండటంతో వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పాత వాహనాలను రద్దు చేసే పనిలో పడింది. గడువు తీరిన వాహనాలు రోడ్లపై నడుస్తుండటంతో కాలుష్యం పెరిగిపోతోందని భావించిన కేంద్రం.. వాటిని రద్దు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ తర్వాత ఆ వాహనాలు రద్దు:

కాగా, వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్‌ 1 నుంచి దేశంలో 15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర నివేదికలు తెలిపాయి. కార్పొరేషన్‌, రవాణా శాఖ బస్సులు, ఇతర వాహనాలకు ఈ కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు తప్పనిసరి వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. రాబోయే 30 రోజుల్లో ఇందుకు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను తెలుపాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌ comments-morth@gov.in కు పంపించాలని కోరింది. అయితే కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకువచ్చింది.

15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌గా మార్చేస్తాం: నితిన్‌ గడ్కరీ

15 ఏళ్లు దాటిన వాహనాలన్నింటిని స్క్రాప్‌గా మార్చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు తెలిపారు. పాత వాహనాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అధికారిక ఫైల్‌లో సంతకం కూడా చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ విధానాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కూడా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అమలు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..