Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon: అమెజాన్‌లో కళ్లు చెదిరిపోయే ఆఫర్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.34,500 వరకు తగ్గింపు

అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక డిస్కౌంట్‌ కల్పిస్తుంటుంది. అయితే మీరు కొత్త ఫోన్‌ కొనాలని భావిస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. అమెజాన్‌లో ఓ ఫోన్‌ భారీ డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది..

Amazon: అమెజాన్‌లో కళ్లు చెదిరిపోయే ఆఫర్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.34,500 వరకు తగ్గింపు
Amazon
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2022 | 6:22 PM

అమెజాన్‌ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక డిస్కౌంట్‌ కల్పిస్తుంటుంది. అయితే మీరు కొత్త ఫోన్‌ కొనాలని భావిస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. అమెజాన్‌లో ఓ ఫోన్‌ భారీ డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ కొనసాగుతుంది. ఇది నవంబర్‌ 29 వరకు ఉంటుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్‌ కంపెనీకి చెందిన గెలక్సీ ఎస్‌22 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది అమెజాన్‌. ఈ ఫోన్‌ అసలు ధర రూ.85,999 ఉండగా, సేల్‌లో భాగంగా రూ.52,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా 38 శాతంతో రూ.34 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌+128 జీబీతో వస్తుంది. 6.1 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 5జీ, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. రూ. 1500 వరకు తగ్గింపును అందుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఈ మొబైల్‌పై మొత్తం రూ.34,500 వరకు తగ్గింపు ఉంటుంది.

అంతేకాకుండా అమెజాన్‌లో మరో ఆఫర్‌ కూడా ఉంది. ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. గరిష్టంగా రూ.25 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకో విషయంలో ఏంటంటే ఈ తగ్గింపు పొందాలంటే మీ ఫోన్ మోడల్, దాని పనితీరుపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఈఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా పొందవచ్చు. 9 నెలల వరకు ఈఎంఐ సదుపాయం ఎంచుకోవచ్చు.

నో కాస్ట్‌ ఈఎంఐ వద్దనుకుంటే రెగ్యులర్ ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. 24 నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. నెలకు రూ. 2569 పడుతుంది. లేదంటే 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 3306 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. 12 నెలల ఈఎంఐ ఎంచుకుంటే నెలకు రూ. 4783 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ఫోన్‌లో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ఈ ఫోన్ . ప్రీమియం ఫోన్ కొనాలని భావించే వారికి ఇది అదిరే డీల్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి