AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI: యూపీఐ నుంచి పొరపాటున డబ్బు తప్పుడు ఖాతాలోకి వెళ్లిందా.? ఇలా చేస్తే తిరిగి మనీ పొందొచ్చు!

కరోనా పుణ్యమా అని.. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ ఎక్కువైపోయాయి.

UPI: యూపీఐ నుంచి పొరపాటున డబ్బు తప్పుడు ఖాతాలోకి వెళ్లిందా.? ఇలా చేస్తే తిరిగి మనీ పొందొచ్చు!
Upi Payments
Ravi Kiran
|

Updated on: Nov 28, 2022 | 6:42 PM

Share

నానాటికీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో బ్యాంకింగ్ వ్యవస్థలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే కరోనా పుణ్యమా అని.. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే ఒకవేళ మీరు ఆన్‌లైన్ లావాదేవీ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ఉపయోగించినట్లయితే, మీ డబ్బు తప్పుడు ఖాతాకు వెళితే, ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సులభమైన మార్గం ద్వారా మీ డబ్బు వాపసు పొందవచ్చు. మరి అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI)తో ఈ రోజుల్లో ఆర్ధిక లావాదేవీలు బాగా జోరుగా సాగుతున్నాయి. సెకన్ల వ్యవధిలోనే మీరు ఎవరికైనా డబ్బును పంపొచ్చు. దీని కోసం మీరు బ్యాంకుకు కూడా వెళ్లవలసిన అవసరం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, ఒకవేళ తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేసినట్లయితే, మీరు వెంటనే RBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. దీంతో పాటు బ్యాంకు శాఖకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుతం సూపర్ మార్కెట్‌ల దగ్గర నుంచి చిన్న కూరగాయల దుకాణాల వరకు, అందరూ కూడా UPI చెల్లింపుల కోసం QR కోడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటిని స్కాన్ చేయడం ద్వారా మనం సులభంగా డబ్బు చెల్లించవచ్చు. కానీ మీరు UPI ద్వారా చెల్లిస్తున్నారనుకోండి.. ఆ సమయంలో పొరపాటున డబ్బు వేరొకరి ఖాతాకు వెళితే.. మీరు Paytm, GPay, PhonePe వంటి యాప్‌ల ద్వారా చెల్లింపు చేసినట్లయితే, ముందుగా మీరు యాప్ కస్టమర్ సర్వీస్‌కి ఫిర్యాదుచేయండి. ఆ తర్వాత మీ బ్యాంక్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేయండి. అలాగే మీ ఫోన్‌కు వచ్చిన ట్రాన్స్‌క్షన్ సందేశాన్ని తొలగించవద్దు.

మొదటిగా ఈ bankingombudsman.rbi.org.in లింక్‌ను సందర్శించండి. ఆ తర్వాత మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా రీఫండ్ కోసం మీరు బ్యాంకుకు దరఖాస్తును సమర్పించాలి. దీనితో పాటు, మీరు మీ బ్యాంక్ ఖాతా, మీరు పొరపాటున డబ్బు పంపిన ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియజేయాలి. పొరపాటున పంపిన అకౌంట్‌‌దారుడు.. మీకు డబ్బును తిరిగి పంపించకపోతే.. మీరు NPCI వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా అతడిపై ఫిర్యాదు చేయవచ్చు.

ఇలా ఫిర్యాదు చేయండి..

మీరు మొదటిగా NPCI వెబ్‌సైట్‌ని సందర్శించి.. ఆ తర్వాత ఫిర్యాదు చేయడానికి.. ‘Dispute Redressal Mechanism’ ట్యాబ్ క్లిక్ చేయాలి. అప్పుడు మీరు లావాదేవీ వివరాలు, ఇష్యూ, లావాదేవీ ID, బ్యాంక్, మొత్తం అమౌంట్, లావాదేవీ తేదీ, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని పూర్తి చేయాలి. తద్వారా మీ రీఫండ్ ఫిర్యాదును ఫైల్ చేయగలరు. అలాగే డబ్బు పంపిన వ్యక్తి తిరిగి ఇవ్వకపోతే.. మీరు దీని గురించి అకౌంట్‌కు సంబంధించిన బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌తో మాట్లాడవలసి ఉంటుంది. అతడు ఆ వ్యక్తితో మాట్లాడటం ద్వారా మీ డబ్బును తిరిగి పొందవచ్చు. ఏదేమైనా.. డిజిటల్ లావాదేవీలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలు కరెక్ట్‌గా నమోదు చేసుకున్నారో.. లేదో.. చూసుకోవడం మంచిది.