Toll Tax Rules: టోల్ టాక్స్ నిబంధనలలో పెద్ద మార్పు.. దేశంలో గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు: మంత్రి నితిన్‌ గడ్కరీ

Subhash Goud

Subhash Goud |

Updated on: Nov 28, 2022 | 6:53 PM

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. హైవేలపై టోల్‌ ట్యాక్స్‌ విషయంలో కీలక మార్పులు చేయనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు..

Toll Tax Rules: టోల్ టాక్స్ నిబంధనలలో పెద్ద మార్పు.. దేశంలో గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు: మంత్రి నితిన్‌ గడ్కరీ
Toll Tax Rules

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. హైవేలపై టోల్‌ ట్యాక్స్‌ విషయంలో కీలక మార్పులు చేయనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. వాహనదారులు ఆందోళన చెందకుండా కోట్లాది మంది డ్రైవర్లను ప్రభావితం చేసే టోల్ ట్యాక్స్‌కు సంబంధించి నితిన్ గడ్కరీ పెద్ద ప్రకటన చేశారు. 2024లోపు దేశంలో 26 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తామని, టోల్‌ ట్యాక్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలను కూడా జారీ చేస్తామని గడ్కరీ చెప్పారు.

టోల్ టాక్స్ టెక్నాలజీలో మార్పు:

ఈ టోల్‌ ట్యాక్స్‌ టెక్నాలజీ విషయంలో మార్పులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం తర్వాత, రోడ్ల విషయంలో భారతదేశం అమెరికాతో సమానంగా మారుతుందని అన్నారు. దీనితో పాటు టోల్ టాక్స్ వసూలు చేయడానికి నియమాలు, సాంకేతికతలో పెద్ద మార్పు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ప్రభుత్వం టోల్ పన్ను రికవరీ కోసం 2 పద్ధతులు:

రాబోయే రోజుల్లో టోల్ రికవరీ కోసం ప్రభుత్వం 2 ఆప్షన్స్‌ ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో మొదటిది కార్లలో ‘GPS’ వ్యవస్థను అమర్చడం,యితే, రెండవ పద్ధతి ఆధునిక నంబర్ ప్లేట్‌కు సంబంధించినది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ట్యాక్స్‌ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష ఉండదు:

కాగా, టోల్‌ ట్యాక్స్‌ చెల్లించని సమయంలో వారికి ఎలాంటి శిక్షలు ఉండవని నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. టోల్ ట్యాక్స్ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష విధించే నిబంధన లేదని అన్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో టోల్ ట్యాక్స్ వసూలుకు టెక్నాలజీ వినియోగంపై కూడా దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

ఖాతా నుండి నేరుగా డబ్బు డెబిట్‌:

ఇప్పటివరకు టోల్ చెల్లించనందుకు శిక్ష విధించే నిబంధన లేదని, అయితే టోల్‌కు సంబంధించిన బిల్లును తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు టోల్ ట్యాక్స్ మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా డెబిట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇకపై టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తం నేరుగా మీ ఖాతా నుంచి కట్‌ అవుతాయని అన్నారు. కార్లకు నెంబర్‌ ప్లేట్ల విషయంలో కూడా నియమాలు మార్చనున్నట్లు చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu