Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Jandhan Yojana: జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న వారికి కేంద్రం శుభవార్త.. ఇంట్లో కూర్చుని సంపాదించేలా కొత్త పథకం

జన్‌ధన్‌ ఖాతాదారులకు ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. జీరో అకౌంట్‌తో తెరిచే సౌకర్యాన్ని కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం.. రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ ఖాతాదారులకు..

PM Jandhan Yojana: జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న వారికి కేంద్రం శుభవార్త.. ఇంట్లో కూర్చుని సంపాదించేలా కొత్త పథకం
Pm Jandhan Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2022 | 2:26 PM

జన్‌ధన్‌ ఖాతాదారులకు ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. జీరో అకౌంట్‌తో తెరిచే సౌకర్యాన్ని కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం.. రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ ఖాతాదారులకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఈ నిర్ణయానికి సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, సెబీ, ఆర్‌బీఐల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొత్త పథకం ద్వారా సామాన్య ప్రజలను పెట్టుబడితో అనుసంధానం చేయాలన్నది ప్రభుత్వ యోచన. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు భారీ లబ్ధి పొందనున్నారు. దీనితో పాటు పెట్టుబడికి ప్రోత్సాహకం కూడా ఉంటుంది. రానున్న కాలంలో జన్ ధన్ ఖాతాదారులను పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం ప్రేరేపిస్తుంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మొదటి దశలో ప్రభుత్వం 47 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ ఖాతాల్లో దాదాపు 1.75 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ డబ్బును ఆర్థిక ఆస్తులతో లింక్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన రెండో దశలో బ్యాంకు ఖాతాదారులను ఆర్థిక ఆస్తులతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఈ పథకం బ్యాంకుకు భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కోసం సెబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది త్వరలో అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన రెండవ దశను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. దేశంలోని కోట్లాది మంది కస్టమర్లు దీని ప్రయోజనం పొందనున్నారు. దీనిపై త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

సామాన్య ప్రజలలో బ్యాంకింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మీరు జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా మీరు ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి మీరు మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను సమర్పించాలి. భారతదేశంలో నివసించే పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే వ్యక్తి వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి