AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Insurance: మీ కారుకు బీమా చేయిస్తున్నారా..? ఏడాది లేదా మూడేళ్లు.. ఇందులో ఏది బెటర్?

కారు కొనుగోలు చేసినప్పుడు అన్ని పత్రాలతో పాటు రకరకాల ఆక్సెసరీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి 1-ఇయర్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలా లేక..

Car Insurance: మీ కారుకు బీమా చేయిస్తున్నారా..? ఏడాది లేదా మూడేళ్లు.. ఇందులో ఏది బెటర్?
Car Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2022 | 4:33 PM

కారు కొనుగోలు చేసినప్పుడు అన్ని పత్రాలతో పాటు రకరకాల ఆక్సెసరీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి 1-ఇయర్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలా లేక 3-ఇయర్ ప్లాన్ తీసుకోవాలా అనే అయోమయంలో చాలా మంది ఉంటారు. రెండు బీమా పథకాలలో దేనికి దానికి లాభాలూ ఉన్నాయి. నష్టాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఏమి చేయాలనేది చాలా మందికి అర్థం కాదు. ఇలాంటి విషయంలో చాలా మంది గందరగోళంలో పడిపోతుంటారు. అయితే కారు బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

2018లో సుప్రీంకోర్టు 3 సంవత్సరాల పాటు బీమా పాలసీకి థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీని తప్పనిసరి చేసింది. ఒకవైపు 3 సంవత్సరాల పాటు థర్డ్ పార్టీ బాధ్యత కవర్ కలిగి ఉండటం తప్పనిసరి. మరోవైపు మీరు ఒకేసారి సంవత్సరం కాంప్రహేన్సీవ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ కవర్ అంటే బీమా హోల్డర్ కారు మరొక వ్యక్కి సంబంధించిన ఆస్తిని పాడు చేసినట్లయితే లేదా అతను భౌతికంగా గాయపడినట్లయితే, ఆ సందర్భంలో కవర్ అవుతుంది. కాంప్రహేన్సీవ్ కవర్‌లో, థర్డ్ పార్టీ నష్టాలతో పాటు మరమ్మత్తు లేదా భర్తీ ఖర్చుకూడా కవర్ అవుతుంది.

కాంప్రహెన్షివ్ కవరేజ్

కాంప్రహేన్సీవ్ కారు ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం.. కాంప్రహెన్షివ్ కవరేజ్ కింద థర్డ్ పార్టీకి జరిగిన నష్టానికి కవరేజీ అందించడమే కాకుండా, మీ వాహనానికి జరిగే నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. విధ్వంసం, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు వంటివి కూడా ఈ కవరేజ్ పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు మీరు వేర్వేరు ప్రొవైడర్లతో యాడ్-ఆన్ కవరేజ్‌లను కూడా కనుగొనవచ్చు. ఇంజిన్ రక్షణ, వైద్య ఖర్చులు, ఉపకరణాలు మొదలైన వాటిని కవర్ చేయడానికి యాడ్-ఆన్ పాలసీలు ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

బీమా డిక్లేర్డ్ వాల్యూ అంటే ఏమిటి?

మీ వాహన బీమా డిక్లేర్డ్ విలువ మీ వాహనానికి చేయాల్సిన మొత్తం బీమాతో సమానం. ఏదైనా దొంగతనం వల్ల జరిన సమయంలో నష్టం వాటిల్లడం, వాహనానికి మరమ్మతులకు అయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకొని బీమా కవరేజిని ఎంచుకోవాలి. ఇది మోటార్ ఇన్సూరెన్స్ కవర్ అతి ముఖ్యమైన అంశమని గుర్తించుకోవాలి. ఒక సంవత్సరం బీమా అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ప్రతి సంవత్సరం బీమా కంపెనీని మార్చవచ్చు. అంటే మీకు బీమా కంపెనీ సేవలు నచ్చకపోతే దాన్ని మూడేళ్లపాటు ఉపయోగించకుండా కొత్త ప్రదేశం నుంచి బీమా పొందవచ్చు. అదే సమయంలో మూడేళ్ల బీమా ప్లాన్‌లో మీరు ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూవల్ చేసుకునే ఇబ్బందులను నివారించవచ్చు. ఒకేసారి బీమాను కొనుగోలు చేయడం ద్వారా మీరు మూడేళ్లపాటు విశ్రాంతి తీసుకోవచ్చు.

ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఒకేసారి బహుళ-సంవత్సరాల బీమా పథకాన్ని తీసుకోవడం ద్వారా మీరు రెండు లేదా మూడు సంవత్సరాల పాటు దాని గురించి చింతించకుండా నివారించవచ్చు. మరొక పెద్ద ప్రయోజనం తక్షణ నో క్లెయిమ్ బోనస్ అంటే ఎన్‌సీబీ. మీరు పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా మీ కారును విక్రయించి, కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు మీరు మీ పేరుకుపోయిన ఎన్‌సీబీని కొత్త కారుకు బదిలీ చేయవచ్చు. అలాగే కొత్త ప్రీమియంపై తగ్గింపు పొందవచ్చు.

మొత్తంమీద రెండు ప్లాన్‌లకు వాటి స్వంత లాభాలు అలాగే, నష్టాలు ఉన్నాయి. ఏ పాలసీని పొందాలో నిర్ణయించేటప్పుడు మీరు ఎప్పుడూ మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మీకు ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి