AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Data Leak: 5.4 మిలియన్ల ట్విట్టర్ వినియోగదారుల డేటా లీక్

ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి ఎలోన్ మస్క్ ట్విట్టర్ వాల్యూమ్‌ను మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు కార్మికులను తొలగించడం, కొన్నిసార్లు బ్లూ టిక్ కోసం..

Twitter Data Leak: 5.4 మిలియన్ల ట్విట్టర్ వినియోగదారుల డేటా లీక్
Twitter
Subhash Goud
|

Updated on: Nov 28, 2022 | 3:44 PM

Share

ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి ఎలోన్ మస్క్ ట్విట్టర్ వాల్యూమ్‌ను మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు కార్మికులను తొలగించడం, కొన్నిసార్లు బ్లూ టిక్ కోసం వినియోగదారుల నుండి డబ్బు వసూలు చేయాలని ఆలోచించడం వంటి నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సంస్థలో పని చేసే వ్యక్తులకు అనుగుణంగా ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు ఎలోన్‌ మాస్క్‌. అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతే ఉద్యోగం పోతుందని కూడా సందేశం కూడా ఇచ్చాడు. అయితే వీటన్నింటి మధ్యలో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌కు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇటీవలి నివేదిక ప్రకారం.. 5.4 మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్‌ అయినట్లు ట్విట్టర్‌ ధృవీకరించింది.

5.4 మిలియన్ల ట్విట్టర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో లీకైనట్లు గుర్తించారు. అక్కడ వేరే ట్విట్టర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API)ని ఉపయోగించి అదనంగా 1.4 మిలియన్ల ట్విట్టర్ ప్రొఫైల్‌లు సేకరించారు హ్యాకర్లు. ఇది కొంతమంది హానికరమైన వ్యక్తుల మధ్య ప్రైవేట్ ప్రాతిపదికన భాగస్వామ్యం చేయబడినట్లు కూడా నివేదించబడింది.

లీక్ అయిన కస్టమర్ల వ్యక్తిగత సమాచారంలో ఏముంది:

Bleeping Computer నివేదికల ప్రకారం.. ఈ భారీ మొత్తంలో డేటా స్క్రాప్ చేయబడిన పబ్లిక్ సమాచారం ఉంది. ఇందులో కస్టమర్‌ల ప్రైవేట్ ఫోన్ నంబర్‌లు, అలాగే ఇమెయిల్ అడ్రస్‌లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఆ విషయాన్ని ముందుగా గమనించేది ఎవరు?

ఈ విషయాన్ని ముందుగానే సెక్యూరిటీ నిపుణుడు చాడ్ లోడర్ మొదట గుర్తించారు. ఆ తర్వాత వెంటనే ట్విట్టర్ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్‌లోని మిలియన్ల కొద్దీ ట్విట్టర్ ఖాతాలను ప్రభావితం చేసే ట్విట్టర్ డేటా ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను ఇప్పుడే తెలుసుకున్నాను. లీక్‌ అయిన ఖాతాను సైతం గుర్తించాను. లీకైన వివరాలు సరైనవేనని వారు ధృవీకరించారు. 2021కి ముందు ట్విట్టర్‌లో ఇలాంటి డేటా లీక్‌ అంటూ జరగేలేదని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని సైన్స్అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి