Reliance Jio App: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రిలయన్స్‌ జియో నుంచి సరికొత్త యాప్‌

దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్‌ జియో వినియోగదారుల కోసం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. షార్ట్ వీడియోస్ కోసం ఈ యాప్‌ను..

Reliance Jio App: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రిలయన్స్‌ జియో నుంచి సరికొత్త యాప్‌
Jio App
Follow us

|

Updated on: Nov 28, 2022 | 5:59 PM

దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్‌ జియో వినియోగదారుల కోసం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. షార్ట్ వీడియోస్ కోసం ఈ యాప్‌ను రూపొందించింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరహాలోనే ఈ యాప్ కూడా యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ యాప్‌ ప్రారంభంలో మొదట వంద మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఆ తర్వాత ఇన్విటేషన్ రూపంలో ఇతరులకు ఆహ్వానం పంపిస్తారు. వినోదాన్ని అందించే స్టార్స్‌కు వినోదాన్ని అందించే స్టార్స్‌కు ఇదొక అంతిమ గమ్యం అవుతుంది. గాయకులు, సంగీతకారులు, నటులు, హాస్య నటులు, డ్యాన్సర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంస్కృతిని ప్రభావితం చేసే సృష్టికర్తలు అందరికీ ఇది గమ్యస్థానం” అని జియో ఫ్లాట్‌ఫామ్స్ ఓ ప్రటనలో తెలిపింది.

షార్ట్‌ వీడియోలు:

రిలయన్స్‌ జియో తీసుకువచ్చిన ఈ కొత్త యాప్‌లో షార్ట్‌ వీడియోలు అప్‌లోడ్‌, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియో యాప్ బీటా వెర్షన్‌లో వచ్చింది. పూర్తి స్థాయి వెర్షన్ 2023 జనవరి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అపుడు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అయితే ప్రస్తుం అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ అందరికి అవకాశం ఉండదు. తర్వాత వెర్షన్‌లో అందరికి అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి