Gujarat Election 2022: ఓటింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే 100 శాతం పోలింగ్.. ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల 2022 మొదటి దశ ఎన్నికలు పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. గుజరాత్‌లోని 19 జిల్లాల్లో, 89 స్థానాలకు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల 2022 మొదటి దశ ఎన్నికలు పోలింగ్ ముగింపు దశకు చేరుకుంది. గుజరాత్‌లోని 19 జిల్లాల్లో, 89 స్థానాలకు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. మొదటి దశలో మొత్తం 2 కోట్ల 39 లక్షల 76 వేల 670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే తొలి దశలో గుజరాత్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో.. పోలింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే 100 శాతం ఓటింగ్ నమోదైంది. దట్టమైన అడవి, నది ప్రాంతం మధ్య ఉన్న ఈ పోలింగ్ స్టేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం నాలుగు గంటలకే ఈ పోలింగ్ కేంద్రంలో 100శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గుజరాత్ ఎన్నికల సిబ్బంది రిస్క్ తీసుకొని ఇక్కడ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే 100 శాతం ఓటింగ్ పూర్తవ్వడంతో ఈ పోలింగ్ కేంద్రం రికార్డుల్లోకెక్కింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహంత్ హరిదాస్ కోసం పోలింగ్ స్టేషన్..
ఒక్క ఓటుతో ప్రభుత్వం ఏర్పడుతుందని, అదే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుంది.. ఇది భారత రాజకీయాల్లో ఇంతకు ముందు కూడా కనిపించింది. ఓటు విలువను గుర్తించిన ఎన్నికల సంఘం ఒక్క ఓటరుకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది గుజరాత్‌లోని సోమనాథ్‌లోని ఉనా అసెంబ్లీ నియోజకవర్గంలోని జామ్వాడా గ్రామంలోని బనేజ్ ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్. జామ్ వాడా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో గిర్ దట్టమైన అడవిలో బాన్ మహాదేవ్ ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ఆలయానికి మహంత్‌గా భరతదాస్ బాపు మాత్రమే ఉండేవారు. 2019 సంవత్సరంలో మరణించిన తరువాత, కొత్త మహంత్ హరిదాస్ బాపు అతని స్థానంలో ఆలయ నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. వీరికి మాత్రమే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
#ECI has set up a polling booth for only one voter, Mahant Haridasji Udasin in Banej (93-Una AC) in the dense jungles of Gir.
Glimpses of Haridas Ji casting his vote during 1st phase of #GujaratElections2022.#novotertobeleftbehind #GujaratAssemblyPolls #ECI #EveryVoteMatters pic.twitter.com/FhDDELyRXU
— Election Commission of India #SVEEP (@ECISVEEP) December 1, 2022
బూత్ సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు..
ప్రజాస్వామ్య ఓటు మహోత్సవంలో మహంత్ కూడా ఓటర్లతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. సంత్ హరిదాస్ బాపు గిర్ సోమనాథ్ జిల్లాలోని బనేజ్‌లో ఓటు వేశారు. బనేజ్‌లో సంత్ హరిదాస్ బాపు మాత్రమే ఓటరుగా ఉన్నారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం హరిదాస్ బాపు వందశాతం ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బనేజ్ అడవికి వచ్చినందున, సంత్ హరిదాస్ బాపు బూత్ సిబ్బందికి బస చేయడానికి, తినడానికి భోజనం ఏర్పాట్లు చేశాడు.
చారిత్రాత్మక ప్రాంతం..
కొద్ది రోజుల క్రితం టీవీ9 బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది. టీవీ9తో జరిగిన సంభాషణలో మహంత్ హరిదాస్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి చారిత్రాత్మక, పౌరాణిక ప్రాధాన్యత ఉందన్నారు. మహాభారత కాలంలో గిర్ పర్వతం చుట్టూ ఉన్న ఈ ప్రాంతానికి పాండవులు వచ్చారన్నారు. వారు మహాదేవుని పూజించారని.. అప్పటి నుంచి ఈ ప్రదేశం ప్రజల విశ్వాసానికి కేంద్రంగా మారిందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..