Gujarat Election 2022: గుజరాత్‌లో ముగిసిన తొలిదశ పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంత నమోదైందంటే..?
గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57 శాతం పోలింగ్ నమోదయ్యింది. 19 జిల్లాల్లో 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 5వ తేదీన రెండోదశ పోలింగ్ జరుగనుంది.
Gujarat Election 2022: గుజరాత్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57 శాతం పోలింగ్ నమోదయ్యింది. 19 జిల్లాల్లో 89 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 5వ తేదీన రెండోదశ పోలింగ్ జరుగనుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ 19 జిల్లాల్లోని 89 స్థానాల్లో జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఓటింగ్ సగటున 58.21 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 19 జిల్లాల్లోని 89 స్థానాల్లో సగటున 48.48 శాతం ఓటింగ్ నమోదైంది. ఇందులో తాపీ- 63.98 శాతం, నర్మద- 63.95 శాతం, డాంగ్- 58.55 శాతం, వల్సాద్- 53.61 శాతం, భరూచ్- 52.87 శాతం, గిర్ సోమనాథ్- 50.82 శాతం, నవసారి- 54.79. శాతం, మోర్బీ- 53 శాతంతో సహా ఎనిమిది జిల్లాల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. కాగా.. కొన్ని చోట్ల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 5గంటల కల్లా లైనులో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఓటింగ్ శాతంపై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..
పలువురు ప్రముఖులు ఓటేశారు. జామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్ధిగా ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. రవీంద్ర జడేజా కూడా ఓటేశారు. సూరత్‌లో కూడా చురుగ్గా ఓటింగ్ జరిగింది. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ సీనియర్ మంత్రి సీఆర్ పాటిల్ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ అర్జున్ మొడ్వాడియా పోర్‌బందర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఉదయం నుంచే బారులు తీరిన జనం..
గుజరాత్ మొదటి దశ ఎన్నికల్లో ఉత్సాహం నెలకొంది. సౌరాష్ట్ర-కచ్, దక్షిణ గుజరాత్‌లో జరిగిన తొలి దశ ఎన్నికలు ఓటింగ్ లో జనం, యువత ఓటువేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మోడీ రోడ్ షో..
ఇదిలాఉంటే.. రెండో దశ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని మోడీ మెగా రోడ్‌షో నిర్వహించారు. అహ్మదాబాద్ లోని 16 సీట్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో జరిగింది. బీజేపీని మళ్లీ గెలిపించాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..