Aftab Narco Test: ఆఫ్తాబ్‌కు నార్కోటిక్ టెస్ట్ పూర్తి.. శ్రద్ధా హత్యలో రివీలైన షాకింగ్ అంశాలు..
నార్కో టెస్ట్‌లో శ్రద్దా హత్యపై అన్ని విషయాలు బయటకు కక్కాడు అఫ్తాబ్. క్షణికావేశంలో తాను హత్య చేశానని తెలిపాడు. అయితే మర్డర్ చేసిన్నందుకు బాధగా లేదని..

నార్కో టెస్ట్‌లో శ్రద్దా హత్యపై అన్ని విషయాలు బయటకు కక్కాడు అఫ్తాబ్. క్షణికావేశంలో తాను హత్య చేశానని తెలిపాడు. అయితే మర్డర్ చేసిన్నందుకు బాధగా లేదని, ఏ శిక్షనైనా అనుభవించడానికైనా సిద్దమని అన్నారు. ఢిల్లీలో శ్రద్దా వాకర్ మర్డర్ కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్‌లు చేశారు పోలీసులు. ఢిల్లీ లోని అంబేద్కర్ ఆస్పత్రిలో అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ నిర్వహించారు. అఫ్తాబ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని , అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పారని పోలీసులు తెలిపారు. 2 గంటల సేపు అఫ్తాబ్ నార్కో టెస్ట్ జరిగింది. తరువాత గంటసేపు వైద్యుల పర్యవేక్షణలో అఫ్తాబ్‌ను ఉంచారు. వైద్యపరీక్ష తరువాత అఫ్తాబ్‌ను గట్టి భద్రత మధ్య తిరిగి తీహార్ జైలుకు తరలించారు.
అఫ్తాబ్ నార్కో టెస్ట్‌లో నివ్వెరపరిచే అంశాలు బయటపెట్టాడు. శ్రద్ధా వాకర్‌ను అత్యంత పాశవికంగా కడతేర్చినందుకు తనకు ఇసుమంతైనా పశ్చాత్తాపం లేదని కుండబద్దలు కొట్టాడు. తనను ఉరి తీసినా బాధ లేదన్నాడు. శవాన్ని ముక్కలుగా నరుకుతున్నప్పుడు గానీ ఏమాత్రం బాధగా అనిపించలేదన్నాడు. శ్రద్దాతో సహజీవనం చేస్తూనే 20 మందితో ఫ్రెండ్‌షిప్ చేసినట్టు చెప్పాడు అఫ్తాబ్. నార్కో టెస్ట్‌కు అఫ్తాబ్ పూర్తిగా సహకరించినట్టు వైద్యులు తెలిపారు. మరి ఆఫ్తాబ్‌కు అధికారులు ఏం ప్రశ్నలు వేశారు? అతను ఏం సమాధానం ఇచ్చాడు? చూద్దాం..
Q : ఆఫ్తాబ్.. శ్రద్దను నువ్వే హత్య చేశావా? A: ఔను.. నేనే




Q: ఎందుకని చంపావ్? A: గొడవ జరిగి
Q: నీకు ఇంకా ఎవరెవరు సహకరించారు? A: నేనొక్కడినే
శ్రద్దను నిజంగా ప్రేమించావా? చంపాలనే ప్లాన్‌తోనే ముంబై నుంచి ఢిల్లీకి తీసుకెళ్లావా? అని ప్రశ్నిస్తే ఔననేది అతని సమాధానం. గతంలోనూ శ్రద్దా హత్యకు కుట్ర చేశాడని? దాడి చేశాడని ఆధారాలు బయటపడ్డాయి. ఇదే అంశంపై నిజమేనా అని ప్రశ్నిస్తే ఔననలేదు.. కాదనలేదు..
Q: శ్రద్దను నిజంగా ప్రేమించావా? A: ఔను
Q: చంపాలనే ప్లాన్‌తోనే శ్రద్దను ముంబై నుంచి ఢిల్లీకి తీసుకు వచ్చావ్ కదా? A: హాం..
Q: శ్రద్ద మర్డర్‌కు గతంలో కూడా ట్రై చేశావా? A: (మూలుగులు )
మే 18న శ్రద్దను హత్య చేశాడని ఇప్పటికే నేరాన్ని ఒప్పుకున్నాడు ఆఫ్తాబ్. అయితే హత్య చేశాక ఢిల్లీ నుంచి ఎంచక్కా ముంబైకి షికారు చేశాడు. డెడ్‌బాడీని ఫ్రిజ్‌లో పెట్టి ముంబై వెళ్లినట్టు నార్కో టెస్ట్‌లో రివీల్ చేశాడు. ప్లాన్‌లో భాగంగానే 300 లీటర్ల ఫ్రిజ్ కొన్నట్టు చెప్పాడు.
Q: శ్రద్దను హత్య చేశాక ముంబై నుంచి ఢిల్లీ వెళ్లావా? A: వెళ్లాను. శ్రద్ద డెడ్‌బాడీని ఫ్రిజ్‌లో పెట్టాను.
Q: డెడ్‌బాడీని పెట్టడం కోసమే 300 లీటర్ల ఫ్రిజ్ కొన్నావా? A: ఔను..
శ్రద్దను కడతేర్చాలనే ఇన్‌టెన్షన్ వున్న ఆఫ్తాబ్.. క్రైమ్ థ్రిల్లర్‌ను ఫాలో అయ్యాడు. అమెరికన్ క్రైమ్ సిరీసే డెక్స్‌టర్‌ను చూసి ప్లాన్ చేసుకున్నట్టు చెప్పాడు. సినిమాలు చూసి స్కెచ్చేసి.. నిజం బయటకు రాకూడదనే శవాన్ని 35 ముక్కులు చేసినట్టు చెప్పాడు ఆఫ్తాబ్.
Q: నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది..? A: సినిమాల్లో చూశా
Q: అవి ఏ సినిమాలు? A: DEXTER
Q: డెడ్‌బాడీని ఎన్ని ముక్కలు చేశావ్? A: 35 ?
Q: ఒకే ఆయుధం వాడావా? A: కాదు.. ఎక్కువే వాడాను
Q: ఇదంతా ఎందుకు చేశావ్? A: నిజం బయటపడొద్దని
శ్రద్దతో పరిచయం ఎప్పటి నుంచో చెప్పాడు. ఎందుకలా హత్య చేశావ్ అంటే మాత్రం నోరు మెదపలేదు. తన నిర్వాకం కుటుంబసభ్యులకు తెలుసా అని అడిగితే లేదన్నాడు.
Q: శ్రద్దతో పరిచయం ఎప్పటి నుంచి? A: చాలా కాలం నుంచే
Q: శ్రద్దతో పాటు ఇంకెంత మంది అమ్మాయిలతో రిలేషన్.. A: (సైలెన్స్)
Q. ప్రేమించావ్ కదా. అలా ముక్క ముక్కలుగా ఎందుకు నరికావ్? A: ( సైలెన్స్)
Q: శ్రద్ద హత్య విషయం మీ కుటుంబానికి తెలుసా? A: లేదు.
పాలిగ్రాఫ్‌లో ఏం చెప్పాడో నార్కో అనాలసిస్‌లోనూ సేమ్ అవే వివరాలు వెల్లడించి తన నేరాన్ని ఒప్పుకున్నాడు ఆఫ్తాబ్. శ్రద్దతో పాటు మరికొందరు అమ్మాయిలతోనూ ఆఫ్తాబ్ లవ్ కహానీలు ఇప్పటికే దర్యాప్తులో బయటపడ్డాయి. 20 మందికి పైగా యువతుల్ని ట్రాప్ చేశాడని, శ్రద్దను హత్య చేశాక..డెడ్‌బాడీని ఫ్రిజ్‌లో పెట్టి మరో లవర్‌ను ఇంటికి తీసుకొచ్చాడని తేలింది. ఆమె ఎవరో కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆమెను కూడా ఓ విక్టమ్‌లానే పరిగణిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




