AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: అదే ప్రధాని మోడీ గొప్పతనం.. అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపిన పీఎం.. వీడియో

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంంద్ర మోడీ.. మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం కాసేపు తన కాన్వాయ్‌ను ఆపారు.

PM Narendra Modi: అదే ప్రధాని మోడీ గొప్పతనం.. అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపిన పీఎం.. వీడియో
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2022 | 8:22 PM

Share

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంంద్ర మోడీ.. మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం కాసేపు తన కాన్వాయ్‌ను ఆపారు. డిసెంబర్ 5న జరగనున్న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో మెగా రోడ్‌షో నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య ప్రధాని మోడీ గురువారం సాయంత్రం అహ్మదాబాద్‌లో రోడ్‌షో కొనసాగింది. బీజేపీ అభ్యర్ధుల గెలుపుకోసం అహ్మదాబాద్‌ లోని 16 సీట్లను కవర్‌ చేస్తూ 50 కిలోమీటర్ల మేర ప్రధాని మోడీ రోడ్‌షో జరిగింది. కాన్వాయ్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ.. ముందుకు సాగారు.

ఈ సమయంలో కాన్వాయ్ వెనుకనుంచి వస్తున్న అంబులెన్స్ భారీ జనసందోహం మధ్య ఇరుక్కుపోయింది. ఈ సమయంలో అంబులెన్స్‌ను గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దానికి దారి ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి.. నరేంద్ర మోడీ కాన్వాయ్‌ను కొన్ని సెకన్ల పాటు పక్కకు ఆపి.. అంబులెన్స్ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్ఐ వీడియోను షేర్ చేసింది. ప్రధాని ప్రయాణిస్తున్న వాహనం వెనుక నుంయి వచ్చిన అంబులెన్స్‌కు దారి ఇవ్వడం దీనిలో కనిపించింది. మానవత్వానికి ప్రతిరూపంగా ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు అభినందిస్తున్నారు. గతంలో కూడా ప్రధాని మోడీ అంబులెన్స్‌కు దారి ఇచ్చిన విషయం తెలిసిందే.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రాలో జరిగిన ర్యాలీ సందర్భంగా.. ప్రధాని మోదీ అంబులెన్స్ కోసం తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. దీంతోపాటు సెప్టెంబర్ 30న అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు వెళుతుండగా అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి ప్రధాని మోదీ కాన్వాయ్ కాసేపు ఆగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..