AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robbery: మీ దుంప తెగ.. ఇలా తయారేంట్రా మీరు.. చోర కళ చరిత్రలోనే తొలిసారిగా..

బీహార్‌ రాజధాని పాట్నాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మొబైల్ కంపెనీ అధికారులుగా నటిస్తూ.. ఏకంగా సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు.

Robbery: మీ దుంప తెగ.. ఇలా తయారేంట్రా మీరు.. చోర కళ చరిత్రలోనే తొలిసారిగా..
Mobile Tower
Shiva Prajapati
|

Updated on: Dec 01, 2022 | 9:41 PM

Share

బీహార్‌ రాజధాని పాట్నాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మొబైల్ కంపెనీ అధికారులుగా నటిస్తూ.. ఏకంగా సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. రూ. 19 లక్షల విలువ చేసే ఈ టవర్‌ను చూస్తుండగానే మాయం చేశారు మాయగాళ్లు. పాట్నాలోని గార్దానీబాగ్ ప్రాంతంలోని యార్‌పూర్‌ రాజ్‌పుతానా కాలనీలో ఉన్న లాలన్ సింగ్ అనే వ్యక్తి ఇంటి టెర్రస్‌పై గుజరాత్ టెలి లింక్ ప్రైవేట్ లిమిటెడ్(GTPL) కంపెనీ టవర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, కొందరు వ్యక్తులు లాలన్ సింగ్ వద్దకు వచ్చి.. కంపెనీకి భారీ నష్టాలు వస్తున్నాయని, అందుకే తాము మొబైల్ టవర్‌ను తొలగించాలని ప్లాన్ చేశామని చెప్పారు. చూడటానికి అధికారుల మాదిరిగానే ఉండటంతో నమ్మిన లాలన్ సింగ్.. అందుకు అంగీకరించాడు. వారి ఐడీ కార్డులను కూడా చూడకుండానే టవర్‌ను తొలగించేందుకు ఒప్పుకున్నాడు. దాంతో అదే ఛాన్స్‌గా భావించిన కేటుగాళ్లు.. తమ ప్లాన్‌ను అమల్లో పెట్టారు.

మరుసటి రోజు 25 మంది బృందం వచ్చి.. మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి గ్యాస్ కట్టర్ మిషన్‌తో మొబైల్ టవర్‌ను ముక్కలు చేశారు. ఆ ముక్కను ఓ ట్రక్కులో ఎక్కించుకుని ఎంచక్కా వెళ్లిపోయారు. అయితే, ఈ విషయం చివరకు అసలైన అధికారులకు చేరింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. టవర్ నిర్మించిన స్థల యజమానిని విచారించారు. అసలు విషయం చెప్పడంతో వారు కంగుతిన్నారు. చోరీకి గురైన మొబైల్ టవర్ విలువ రూ. 19 లక్షలు ఉంటుందని, 15 ఏళ్ల క్రితం లాలన్ సింగ్‌ ఇంటిపై అమర్చామని జీటీపీఎల్ అధికారులు తెలిపారు. సెల్ టవర్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కంపెనీ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. గతంలోనూ బీహార్‌లో ఇలా వింత చోరీ జరిగింది. ససారం జిల్లాలో 500 టన్నుల బరువున్న 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను జలవనరుల శాఖ అధికారుల పేరి చెప్పి ఎత్తుకెళ్లారు. మొన్నటి మొన్న ఏకంగా రైలింజన్‌నే ఎత్తుకెళ్లారు దుండగులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
'పెద్ది' డైరెక్టర్ తో సినిమా.. చిరు రియాక్షన్ ఏంటో చూశారా? వీడియో
'పెద్ది' డైరెక్టర్ తో సినిమా.. చిరు రియాక్షన్ ఏంటో చూశారా? వీడియో
భారీ గ్రహాల కదలికలు.. వీరికి కుప్పలు తెప్పలుగా డబ్బు..
భారీ గ్రహాల కదలికలు.. వీరికి కుప్పలు తెప్పలుగా డబ్బు..
రోహిత్ రనౌట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్
రోహిత్ రనౌట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్
గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు..తిరిగి శవమై వచ్చిన టెకీ! ఏం జరిగిందో
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు..తిరిగి శవమై వచ్చిన టెకీ! ఏం జరిగిందో
పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ హీరో ఒక్క ఫోన్ కాల్ చేసి విడిపించారు
పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ హీరో ఒక్క ఫోన్ కాల్ చేసి విడిపించారు
వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?
వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..