AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిచ్చగాళ్లు సైతం ట్యాక్స్ కడతారని తెలుసా? మీ మతిపోగొట్టే నిజాలు

రోడ్లపై బిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, ఆ వస్తువులకు GST వర్తిస్తే ధరలోని పన్ను భాగాన్ని వారు కూడా భరిస్తారు. అయితే వారు నేరుగా ప్రభుత్వానికి GST చెల్లించరు. దుకాణదారుడు పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఇది ఆదాయపు పన్ను కాకుండా వినియోగదారుడిపై పడే పరోక్ష పన్ను భారం మాత్రమే.

బిచ్చగాళ్లు సైతం ట్యాక్స్ కడతారని తెలుసా? మీ మతిపోగొట్టే నిజాలు
Do Beggars Pay Tax
SN Pasha
|

Updated on: Aug 17, 2026 | 4:46 PM

Share

రోడ్ల వెంట, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారిని మనం తరచూ చూస్తుంటాం. వారికి ప్రజలు ఇచ్చే డబ్బు‌తో పాపం ఏదో ఒకటి తిని బతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్లు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతుంటారు అంటే నమ్ముతారా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే వారు ట్యాక్స్ ఏ విధంగా చెల్లిస్తున్నారు? ప్రత్యక్షంగానా? లేక పరోక్షంగానే? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

GST.. పరోక్ష పన్ను

GST (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అంటే వస్తువులు, సేవల వినియోగంపై విధించే పరోక్ష పన్ను. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) ప్రకారం GST ఒక డెస్టినేషన్-బేస్డ్ కన్సంప్షన్ ట్యాక్స్. సరఫరా గొలుసులో పన్ను వసూలు అవుతున్నప్పటికీ, తుది వినియోగదారుడే పన్ను భారాన్ని భరిస్తాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి రోజంతా రోడ్ల వెంట తిరిగి బిక్షగా రూ.100 సంపాదించాడనుకుందాం. ఆ రూ.100తో తనకు కావాల్సిన ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల కొంటే, ఆ వస్తువులు GST వర్తించేవిగా ఉంటే, ఆ వస్తువు ధరలో ఉన్న GST కూడా అతను చెల్లించినట్టే. అయితే దుకాణదారుడే GSTని ప్రభుత్వానికి చెల్లించే బాధ్యత కలిగిన వ్యక్తి. వినియోగదారుడు సాధారణంగా GSTని నేరుగా ప్రభుత్వానికి చెల్లించడు.

మరి దీనిని ‘పరోక్ష పన్ను చెల్లింపు’ అనొచ్చా?

ఆర్థిక పరంగా చూస్తే.. బిచ్చగాడు సైతం పరోక్షంగా పన్ను చెల్లించినట్లే. ఒక వ్యక్తి సంపాదించిన డబ్బుతో పన్ను వర్తించే వస్తువు లేదా సేవ కొనుగోలు చేసినప్పుడు, ఆ ధరలోని పన్ను భారం అతనిపైనే పడుతుంది. అతను ఆ డబ్బు ఎలా సంపాదించాడన్నది GST వసూలు చేసే సమయంలో ప్రధాన అంశం కాదు. వస్తువు లేదా సేవపై GST వర్తిస్తుందా లేదా అన్నదే ముఖ్యం. అందుకే ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా, బిక్ష ద్వారా డబ్బు పొందిన వ్యక్తి అయినా.. GST వర్తించే వస్తువును తుది వినియోగదారుగా కొనుగోలు చేస్తే పన్ను భారాన్ని భరించే అవకాశం ఉంటుంది.

బిక్షగా వచ్చిన డబ్బుపై ఇన్‌కమ్ ట్యాక్స్ ఉంటుందా?

GST చెల్లించడం అంటే ఆ వ్యక్తి ఆదాయంపై ట్యాక్స్ చెల్లిస్తున్నాడని కాదు. ఆదాయపు పన్ను చట్టంలో ఏదైనా రసీదు లేదా ఆదాయం పన్నుకు లోబడి ఉందా అనేది దాని స్వభావం, వర్తించే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆదాయపు పన్ను శాఖ వివరిస్తున్న Section 56(2)(x)లో నిర్దిష్ట పరిస్థితుల్లో వ్యక్తులు ఎటువంటి ప్రతిఫలం లేకుండా పొందే డబ్బు లేదా ఆస్తి పన్నుకు లోబడి ఉండే నిబంధనలు ఉన్నాయి. అయితే దానిని రోడ్డు పక్కన బిక్షగా అందుకునే ప్రతి మొత్తానికి ఆటోమేటిక్‌గా వర్తిస్తుందని చెప్పడం సరైంది కాదు.

పరోక్ష పన్నుల ప్రత్యేకత ఏంటంటే.. ఒక వ్యక్తి ఆదాయం ఎంత అన్నదానితో సంబంధం లేకుండా, GST వర్తించే వస్తువు కొనుగోలు చేస్తే ధరలో పన్ను భాగం ఉండవచ్చు. అంటే ఆదాయం తక్కువగా ఉన్న వ్యక్తి కూడా రోజువారీ వినియోగంలో పరోక్ష పన్నుల భారం మోసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బిక్షగా వచ్చిన రూ.200తో ఒక వ్యక్తి పన్ను వర్తించే వస్తువులు కొనుగోలు చేస్తే, వాటి ధరలో GST భాగం ఉంటే ఆ పన్ను భారం కూడా అతని ఖర్చులోనే ఉంటుంది.

అన్ని వస్తువులపైనా GST ఉండదు

అయితే కొన్న ప్రతి వస్తువుపై GST ఉంటుందా అంటే.. ఉండదు. వస్తువు లేదా సేవను బట్టి GST రేటు మారుతుంది. కొన్ని వస్తువులకు జీరో ట్యాక్స్ వర్తిస్తుంది. లేదా మినహాయింపు ఉండవచ్చు. GST రేట్లు వస్తువు, సేవల వర్గీకరణపై ఆధారపడి ఉంటాయి.

Follow Us
పాక్‌పై గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా
పాక్‌పై గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా
రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్
వైకల్యాన్ని ఓడించి.. కాళ్లతోనే చదివి టీచర్‌గా మారాడు!
వైకల్యాన్ని ఓడించి.. కాళ్లతోనే చదివి టీచర్‌గా మారాడు!
చిటికెడు పొడితో మోకాళ్ల నొప్పులు, వాపులు శాశ్వతంగా పోతాయ్
చిటికెడు పొడితో మోకాళ్ల నొప్పులు, వాపులు శాశ్వతంగా పోతాయ్
పెళ్లి విషయం అడిగేందుకు లవర్ ఇంటికి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే
పెళ్లి విషయం అడిగేందుకు లవర్ ఇంటికి వెళ్లిన యువకుడు.. కట్‌చేస్తే
చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్
చెన్నై వేదికగా నేటి నుంచే దులీప్ ట్రోఫీ ఫైనల్
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
33 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సా
33 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సా
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్: ప్రధాని మోదీ
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్: ప్రధాని మోదీ