Viral: పైకి చూస్తే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌లు.. కానీ లోపల చెక్ చేస్తే అంతకుమించి..
ఆ ఇద్దరి దగ్గర ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌లు ఉండటాన్ని గమనించారు. డౌట్ వచ్చి చెక్ చేయడంతో అధికారుల ఫ్యూజులు ఎగిరిపోయాయి.
కేటుగాళ్లు బాగా తెలివిమీరిపోతున్నారు. క్రైమ్ చేసేందుకు తమదైన మార్క్ క్రియేటివిటీకి ఉపయోగిస్తూ.. అధికారులకు దొరక్కుండా యదేచ్చగా డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేస్తున్నారు. పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారులు ఏమైనా తక్కువా.. ఇలాంటివారి ఆటలు కట్టించడమే కాదు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని జైలు ఊసలు లెక్కపెట్టిస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు విదేశీయుల కదలికలపై అనుమానం రావడంతో అక్కడున్న ఇంటిలిజెన్స్ అధికారులు వారిని చెక్ చేయగా.. ఆ ఇద్దరి దగ్గర ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌లు ఉండటాన్ని గమనించారు. డౌట్ వచ్చి చెక్ చేయడంతో అధికారుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు విదేశీ ప్రయాణీకుల నుంచి సుమారు రూ. 18 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఇంటలిజెన్స్ అధికారులు. ఇథియోపియాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ద్వారా అడిస్ అబాబా నుంచి ముంబైకు కెన్యాకు చెందిన ఓ వ్యక్తి, గెనియాకు చెందిన ఓ మహిళ వచ్చారు. వారిద్దరి దగ్గర నాలుగు ఖరీదైన ఖాళీ హ్యాండ్ బ్యాగ్‌లు ఉండటంతో.. వారి కదలికలపై అనుమానం రావడంతో.. విమానాశ్రయంలో ఉన్న ఇంటిలిజెన్స్ అధికారులు ఆ ఇద్దరిని క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాగ్‌లు చెక్ చేయగా 1.8 కిలోల కొకైన్‌తో కూడిన ఎనిమిది ప్లాస్టిక్ పౌచ్‌లు లభ్యమయ్యాయి. దాని విలువ సుమారు రూ. 18 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. విదేశీయులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.