Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Chalisa: పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు తొలగించుకోవడానికి హనుమంతుడి ప్రసన్నం కోసం.. చాలీసాను ఇలా పఠించండి..

హనుమంతుని దర్శనంతోనే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ చర్యలు తీసుకుంటారు. ఇందులో హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం అత్యంత ప్రభావవంతమైన మార్గం.

Hanuman Chalisa: పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు తొలగించుకోవడానికి హనుమంతుడి ప్రసన్నం కోసం.. చాలీసాను ఇలా పఠించండి..
Lord Hanuman
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2022 | 11:53 AM

హిందూ మతంలో.. హనుమంతుడి పూజకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయి. హనుమంతుడు కలియుగ దేవత అని భక్తుల విశ్వాసం. చిరంజీవి హనుమంతుడు నేటికీ భువిపై తిరుగుతున్నాడని నమ్మకం. హనుమంతుడిని ఆరాధించడం వల్ల ఆనందం, సంపద, సానుకూల శక్తి లభిస్తుంది. హనుమంతుని దర్శనంతోనే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ చర్యలు తీసుకుంటారు. ఇందులో హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఈరోజు హనుమంతుడిని పూజించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

అడ్డంకులు, ఇబ్బందులను వదిలించుకోవడానికి రామ భక్త హనుమాన్ సులభంగా ప్రసన్నుడయ్యే దైవం. ఎక్కడ రామకథ, కీర్తనలు గానం చేస్తూ ఉంటారో అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో సంచరిస్తాడని..  భక్తులను అడ్డంకులను నుంచి కాపాడతాడని నమ్మకం. అంతే కాకుండా నిత్యం ఎలాంటి ఆపదలు వచ్చినా ఇబ్బంది పడే వారు మంగళవారం నాడు రావి ఆకుపై బెల్లం నూనెతో కలిపిన మిశ్రమాన్ని తీసుకుని ఆ ఆకుపై రాముని పేరు రాసి హనుమంతుడికి నైవేద్యంగా పెడితే కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.

ప్రతికూల శక్తిని తొలగించడానికి హనుమంతుడికి సిందూరం అంటే చాలా ఇష్టం. మంగళ, శనివారాల్లో హనుమంతునికి పచ్చిమిర్చి సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా, హనుమంతునికి శనగలను సమర్పించడం ద్వారా శని ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. హనుమంతునికి సింధూరం సమర్పించడం ద్వారా.. అన్ని రకాల ప్రతికూల శక్తులనుంచి విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి తులసి అంటే చాలా ఇష్టం. ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నవారు ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి నెయ్యి దీపం, తులసి దళాన్ని సమర్పిస్తే, అతని ఆర్థిక ఇబ్బందులన్నీతొలగుతాయి. అంతే కాకుండా ప్రతి మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శ్రేయస్కరం. దీంతో ఆ వ్యక్తి అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందుతాడు.

విజయం సాధించడానికి హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి.. తమలపాకులను సమర్పించండి. గులాబీ, మందార, తామర, బంతిపూలు, పొద్దుతిరుగుడు వంటి ఎరుపు, గులాబీ లేదా పసుపు పువ్వులతో పూజ చేయడం ద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు.

పనిలో విజయం కోసం హనుమంతుడు సులభంగా సంతోషించే ఒక దేవుడు. అటువంటి పరిస్థితిలో.. పనిలో విజయం పొందడానికి, ఏదైనా హనుమంతుని ఆలయానికి వెళ్లి మంగళవారం నాడు బెల్లాన్ని ప్రసాదంగా సమర్పించండి. అదే ఆలయంలోనే భక్తులకు బెల్లాన్ని పంచి, మిగిలిన ప్రసాదాన్ని మీరు మరియు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)