AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వైకుంఠ ఏకాదశికి 80 వేలమంది భక్తులకు దర్శనం.. అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు

జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించనున్నారు.  ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వైకుంఠ ఏకాదశికి 80 వేలమంది భక్తులకు దర్శనం.. అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు
Tirumala Rush
Surya Kala
|

Updated on: Dec 04, 2022 | 1:21 PM

Share

ఏడాదికి 24 ఏకాదశులు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక ఈ ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకుందని భక్తుల విశ్వాసం. కనుక ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా టీటీడీ పనులు చర్యలు చేపట్టింది.  జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసినట్టు, అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు.

2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరుగనుంది. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించనున్నారు.  ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు “మహా లఘు దర్శనం” కల్పిస్తారు.

దర్శన టికెట్లు:

ఇవి కూడా చదవండి

రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లు విడుదల చేస్తారు. తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటరుతో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి పర్యవేక్షిస్తారు. రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోబడవు.

వసతి సౌకర్యాలు:

నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేశారు. గదుల కేటాయింపులో పారదర్శకత పెంచేందుకు మరిన్ని కౌంటర్లు పెంచి సీఆర్వోలో మాత్రమే కేటాయిస్తారు.

ప్రత్యక్ష ప్రసారాలు:

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 2న తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. జనవరి 3వ తేదీన వైకుంఠ ద్వాదశి రోజున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ స్నపనం అనంతరం చక్రస్నానం చేస్తారు. అన్ని కార్యక్రమాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అదేవిధంగా..సందర్భానుసారంగా పుష్పాలంకరణలు చేయనున్నారు. శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి క్యాడెట్‌లతో భక్తులకు సేవలందించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us