AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇవేం వింత లీవ్ లెటర్స్ సామీ.. సెలవుల కోసం టీచర్ల రీజన్స్ చూస్తే కళ్లు గిర్రున తిరుగుతాయంతే!

కడుపు నొప్పి వస్తోందని, జ్వరం వచ్చిందని, మా నాన్నమ్మకు ఒంట్లో బాగోలేదని.. స్కూల్ లేదా కాలేజీ బంక్ కొట్టేందుకు కొందరు విద్యార్దులు ఇలాంటి కారణాలు చెబుతుంటారు.

Viral: ఇవేం వింత లీవ్ లెటర్స్ సామీ.. సెలవుల కోసం టీచర్ల రీజన్స్ చూస్తే కళ్లు గిర్రున తిరుగుతాయంతే!
Leave Letters Viral
Ravi Kiran
|

Updated on: Dec 04, 2022 | 1:28 PM

Share

స్కూల్ లేదా కాలేజీ బంక్ కొట్టేందుకు కొందరు విద్యార్దులు రకరకాల కారణాలు చెబుతుంటారు. కడుపు నొప్పి వస్తోందని, జ్వరం వచ్చిందని, మా నాన్నమ్మకు ఒంట్లో బాగోలేదని.. ఇలా పలు రీజన్స్ చెబుతారు. స్టూడెంట్స్ విషయంలో ఇవి ఎప్పుడూ సర్వసాధారణమే. అయితే మీరెప్పుడైనా స్కూల్ బంక్ కొట్టేందుకు టీచర్స్ కారణాలు చెప్పడం విన్నారా.? అసలు ఇలాంటిది ఊహించారా.? అవునండీ ఇది నిజమే.. బీహార్‌లోని కొందరు టీచర్స్ లీవ్ కోసం వింత వింత కారణాలు చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన లీవ్ లెటర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే టీచర్ లీవ్ కోసం స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఓ లీవ్ లెటర్ ఇలా రాశాడు. ‘మా అమ్మ ఈ నెల 5వ తేదీ రాత్రి 8 గంటలకు చనిపోతారు. ఆమె అంత్యక్రియల కోసం 6, 7 తేదీల్లో దయచేసి సెలవు ఇవ్వండి’ అని కోరాడు.

కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ అనే టీచర్.. ‘నేను పెళ్లికి వెళ్లాలి. అక్కడ బాగా భోజనం చేస్తాను. అప్పుడు కడుపు నొప్పి రావచ్చు. అందుకోసం డిసెంబర్ 7న లీవ్‌ ఇవ్వండి’ అని కోరాడు.

ఇక బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ టీచర్ రాజ్‌గౌరవ్‌.. ‘నాలుగు రోజుల్లో నా ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకే ముందుగా సెలవు అడుగుతున్నా. డిసెంబర్ 4, 5 తేదీల్లో తనకు సెలవు ఇవ్వండని‘ కోరాడు.  ఈ లెటర్స్ చూశాక స్కూల్ ప్రిన్సిపల్స్‌కు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి.

కాగా, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ లీవ్ లెటర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ వింత లీవ్ లెటర్‌లకు కారణం లేకపోలేదు. ఉపాధ్యాయులు 3 రోజుల ముందుగానే క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా జిల్లాల్లో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 రోజుల ముందుగా క్యాజువల్ లీవ్ దరఖాస్తు చేయకపోతే సెలవులు రావు అని పేర్కొనడంతో.. ఇలా దరఖాస్తు చేస్తున్నారట.

Leave Letters

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!