Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఏడాది వయసుకే లీటర్ల కొద్దీ పాలిస్తున్న లేగ దూడ.. దైవ ఘటన అంటూ పూజలు చేస్తున్న జనం

బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో కలియుగంలో జరగనున్నవింతలు, విశేషాలు అంటూ భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తాజాగా ఓ లేగ దూడ పాలిస్తున్న సంఘటన విన్నవారు మళ్ళీ కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Viral News: ఏడాది వయసుకే లీటర్ల కొద్దీ పాలిస్తున్న లేగ దూడ.. దైవ ఘటన అంటూ పూజలు చేస్తున్న జనం
One Year Old Calf Giving Milk In Up
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2022 | 1:25 PM

ఆవు పంది పిల్లలకు పాలు పట్టించడం, మేకకు పంది పిల్ల పుట్టడం. వింత శిశువుల జననం, చింత చెట్టుకు చామంతి పువ్వు పూయడం ఇలాంటి అనేక వింత సంఘటనలు.. అనేకం ప్రపంచంలో ఎక్కడోచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలా ఎక్కడ ఏ వింతలు  సంఘటనలను చూసినా వెంటనే పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటారు. 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులైన బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో కలియుగంలో జరగనున్నవింతలు, విశేషాలు అంటూ భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తాజాగా ఓ లేగ దూడ పాలిస్తున్న సంఘటన విన్నవారు మళ్ళీ కాలజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.. ఈ వింత ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సంతానం లేకుండానే ఏడాది వయసున్న ఓ ఆవుదూడ లీటర్లకొద్దీ పాలిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఖోరాబర్‌లోని జార్వా నివాసి గిరి నిషాద్‌ అనే వ్యక్తి 15 రోజుల క్రితం ఓ దూడను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఓ వారం రోజులు తర్వాత ఆ దూడ పాలు ఇవ్వడం ప్రారంభించింది. అది చూసి నిషాద్‌ ఏడాది వయసుకే దూడ పాలివ్వడమేంటని ఆశ్చర్యపోయాడు. అయితే మొదట్లో ఈ దూడ పాలు తక్కువగా ఇచ్చేదని.. ఇప్పుడు ఏకంగా 4 లీటర్ల వరకూ పాలు ఇస్తుందని చెప్పాడు. ఎలాంటి సంతానం లేకుండానే పాలిస్తున్న ఆ దూడను దైవంగా భావించి పూజిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు.

అయితే ఈ వింత తెలుసుకున్న గ్రామస్తులు దూడను చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. కొందరైతే దూడ నుంచి పాలు తీసి పరీక్షిస్తున్నారు. అయితే ఈ దూడను పరీక్షించిన పశువైద్యుడు యోగేష్‌ సింగ్‌.. హార్మోన్ల మార్పు వల్లే ఇలా జరుగుతుందని, ఇంతకు ముందు దూడలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చికిత్సకోసం వాడిన మందులు ప్రభావం కూడా కావచ్చని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..