Viral Video: పెళ్లి వేదిక వద్దకు వరుడితో కలిసి వధువు గ్రాండ్ ఎంట్రీ.. ఇలాంటి సన్నివేశం తొలిసారి చూశామంటున్న నెటిజన్లు

వైరల్ అవుతున్న వీడియోలో.. వరుడు థార్ వాహనంలో డ్రైవింగ్ సీటుపై కూర్చొని ఉండగా.. వధువు అతని పక్కన కూర్చుని ఉంది.  అతని పక్కన నిలబడి ఉన్న స్నేహితులు తుపాకీని పట్టుకుని పటాకులు పేలుస్తున్నారు.

Viral Video: పెళ్లి వేదిక వద్దకు వరుడితో కలిసి వధువు గ్రాండ్ ఎంట్రీ.. ఇలాంటి సన్నివేశం తొలిసారి చూశామంటున్న నెటిజన్లు
Bride Groom Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2022 | 10:50 AM

దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది, పెళ్లిళ్లకు వెళ్లి సరదాగా గడుపుతున్నారు, సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్‌లు షేర్ అవుతున్నాయి. నెటిజన్లను పెళ్ళికి చెందిన వీడియో కంటెంట్‌ని చూడటానికి చాలా ఇష్టపడుతున్నారు. వివాహాలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ కావడానికి ఇదే కారణం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో వధూవరులు ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లి విషయంలో ప్రతి జంటకు ఎన్నో కలలు ఉంటాయి. వధువు తాను పెళ్లిలో ధరించే దుస్తులు, నగలు, వేదిక అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. మరోవైపు.. పెళ్లి వేదికలోకి వధూవరుల ఎంట్రీ గురించి మాట్లాడుకున్నట్లు అయితే అది చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి జంటలు తమ పెళ్లిని ప్రత్యేకంగా జరుపుకునేందుకు ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు. పెళ్లి వేడుక లోని వధువు ఎంట్రీ ప్రస్తుతం ఆహుతుల దృష్టిని ఆకర్షిస్తోంది. వరుడు అద్భుతమైన స్టైల్‌తో వధువు రాకకోసం ఎదురుచూస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులు ఇద్దరూ కలిసి ఎంట్రీ ఇస్తున్నట్లు కనిపించారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. వరుడు థార్ వాహనంలో డ్రైవింగ్ సీటుపై కూర్చొని ఉండగా.. వధువు అతని పక్కన కూర్చుని ఉంది.  అతని పక్కన నిలబడి ఉన్న స్నేహితులు తుపాకీని పట్టుకుని పటాకులు పేలుస్తున్నారు. దాని నుంచి మెరుపులు .. వధూవరులను మరింత అందంగా చూపిస్తున్నాయి. క్లిప్ ప్రారంభంలో వధువు కూర్చుని ఉంది.  ఆమె కల్యాణ వేదికపైకి చేరుకునే సమయానికి, ఆమె లేచి నిలబడింది. విశేషమేమిటంటే .. బహరోన్ ఫూల్ బర్సావో మేరా మెహబూబ్ ఆయా హై అంటూ సాగే ఈ పాట ప్లే అవుతోంది.

వధువు  గ్రాండ్ ఎంట్రీ

ఈ వీడియోను @nandinitiwaritn అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై పలువురు వ్యాఖ్యానించడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇలాంటి వధువు ఎంట్రీని తాను తొలిసారి చూశానని ఓ యూజర్ తెలిపారు. మరోవైపు, ఇప్పటి వరకు వరుడు మాత్రమే రథంపై ఇలాంటి ఎంట్రీ ఇచ్చాడని.. ఈ రోజు  వధువు కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్లు మరొక వినియోగదారు కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి