సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఆ ఇల్లు రణరంగమే. నిత్యం కీచులాడుకుంటూ అల్లరి చేస్తూ పెద్దలను తెగ విసిగిస్తారు. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ ఒకటైపోతారు.. ఎంతో ప్రేమగా ఉంటారు. వారు నిత్యం కీచులాడుకున్నా కొద్దిసేపు ఒకరికొకరు కనపడకపోతే విలవిల్లాడిపోతారు. తాజాగా అలాంటి అక్కా చెల్లెళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు క్యూట్ సిస్టర్స్ అంటూ వారి ఆప్యాయతకు మురిసిపోతున్నారు.
ఈ వీడియోలో ఓ రూమ్‌లో ఓ బాలిక చదువుకుంటూ ఉంది. ఇంతలో ఆ రూమ్‌లోకి మరో యువతి ఎంటరయింది. అంతే ఆమెను చూడగానే ఆ బాలిక సర్‌ప్రైజ్ అయిపోయింది. ఆరు నెలల తర్వాత సడన్‌గా ఇంటికి వచ్చిన తన అక్కను చూడగానే షాక్ తింది. వెంటనే అక్కను హగ్ చేసుకుని ముద్దులు పెట్టేస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయింది. వర్జినియా కా ఉల్ప్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆరు నెలల తర్వాత ఇంటికొచ్చి లిటిల్ బేబీ సిస్టర్‌ను సర్‌ప్రైజ్ చేశా.. ఆమె ఎలా రియాక్ట్ అయిందో చూడండి అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
చెల్లెలు ప్రేమ
Came home after six months and surprised my baby not so Baby sister and look how she reacted 🥺❤️🧿 pic.twitter.com/5YJf48QEBn
— 𝔚𝔦𝔰𝔥 (@virginiakawoolf) December 6, 2022
ఈ వీడియోను రెండు లక్షలమందికి పైగా వీక్షించారు. అంతేకాదు వీడియోచూసి చాలామంది స్పందించారు. సోక్యూట్.. వీడియో చూసాక నా కన్నీళ్లు ఆగలేదంటూ ఓ యూజర్ రాసుకొస్తే.. సిస్టర్స్ బాండింగ్ మనసును తాకిందంటూ మరొకరు కామెంట్ చేశారు. మరొకరు “నాకు కూడా ఒక చెల్లెలు ఉంటే బాగుండునను” అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..