AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father-Daughter Love: తండ్రికి కూతురు మరో అమ్మే.. లాలూకి కిడ్నీ ఇచ్చిన తనయ.. ఆపరేషన్ సక్సెస్

గతకొంతకాలంగా లాలూ తీవ్రఅనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తే కోలుకునే అవకాశాలుంటాయని వైద్యులు చెప్పడంతో తన చిన్న కూతురు కిడ్నీ ఇచ్చి తండ్రి మీదున్న ప్రేమను బయటపెట్టింది. తండ్రి కూతురి బంధాన్ని మరోసారి లోకానికి చాటి చెప్పింది.

Father-Daughter Love: తండ్రికి కూతురు మరో అమ్మే.. లాలూకి కిడ్నీ ఇచ్చిన తనయ.. ఆపరేషన్ సక్సెస్
Lalu Prasad Kidney Transplant Surgery Successful
Surya Kala
|

Updated on: Dec 06, 2022 | 7:10 AM

Share

ఏ ఇంట్లో అయితే కూతుళ్లు ఉంటారో? వాళ్ళు భాగ్యవంతులు..ప్రతి కుమార్తె మొదటి ప్రేమ ఆమె తండ్రి.. కూతురు జీవితంలో నాన్న ఓ నమ్మకం… ఓ రియల్ హీరో.. నాన్నకు తన కూతురు మరో అమ్మ.. ఆ కూతురికి నాన్న అంటే ఆకాశమంత ప్రేమ. ఇంటిలో కూతురు మహారాణి.. లక్ష్మీదేవి తన ఇంట్లో నడయాడుతుందని నాన్న తన కూతురిని ఎంతో గారంగా పెంచుకుంటాడు. ఇలా ఎంత చెప్పుకున్న తండ్రీ కూతురు రిలేషన్ గురించి తరగదు. తండ్రి కూతురు ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇంకా చెప్పాలంటే కంటే కూతుర్నే కనాలి రా అన్న పదానికి పర్యాయపదంగా మారింది లాలు ప్రసాద్‌ యాదవ్‌ కూతురు. ఇక తండ్రికి కూతురే కిడ్నీ డొనేట్‌ చేసి తల్లిగ పునర్జన్మనిచ్చింది లాలు ప్రసాద్‌ యాదవ్‌కు.

బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆప‌రేష‌న్ జ‌రిగింది. కాగా లాలు ప్రసాద్ యాదవ్‌కి సింగపూర్‌లోని ఓ హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడీ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని బీహార్ డిప్యూటీ సీఎం, లాలు ప్రసాద్ యాదవ్ చిన్న కొడుకు తేజస్వీ యాదవ్ తెలిపారు. తన తండ్రి, సోదరి ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు. లాలు ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ దానం చేయడానికి ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య ముందుకు వచ్చారు. ఆమె రెండు కిడ్నీలలో ఒకదాన్ని తండ్రి లాలు ప్రసాద్ యాదవ్‌కు ట్రాన్స్‌ప్లాట్ చేశారు. రోహిణి ఆచార్య ఇందుకు సంబంధించి సర్జీరికి ముందు ఓ ఫొటో ట్వీట్ చేశారు. రాక్ అండ్ రోల్‌కు తాను సిద్ధంగా ఉన్నారని రోహిణీ ఆచార్య తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేశారు.

తనకు విష్ చేయాలన్నారు. సర్జరీ కంటే ముందే ఆమె బెడ్ పై తన ఫొటోను, అలాగే, తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో ఆ తర్వాతి పరిణామాన్ని లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు, రాజ్యసభ ఎంపీ మీసా భారతి ట్వీట్ చేశారు. డోనర్ రోహిణీ సింగ్ ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఇప్పుడు తన తండ్రికి ఆపరేషన్ జరుగుతున్నదని అనంతరం ట్వీట్ చేశారు. తన చెల్లి రోహిణి ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఆమెను ఇప్పుడు ఐసీయూలో ఉంచారని వివరించారు. అయితే గతకొంతకాలంగా లాలూ తీవ్రఅనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తే కోలుకునే అవకాశాలుంటాయని వైద్యులు చెప్పడంతో తన చిన్న కూతురు కిడ్నీ ఇచ్చి తండ్రి మీదున్న ప్రేమను బయటపెట్టింది. తండ్రి కూతురి బంధాన్ని మరోసారి లోకానికి చాటి చెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..