Viral Video: పెళ్లి కోసం విమానాన్నే బుక్‌ చేసుకున్న జంట.. ఫ్లైట్‌లో నవ దంపతులతో బంధువర్గం సందడి..

పెళ్లిని డిఫరెంట్‌గా చేసుకోవడమే కాదు, అతిథుల కోసం స్పెషల్‌ అరేంజ్‌మెంట్స్‌ కూడా చేస్తుంటారు. రాజస్థాన్‌లో ఓ జంట ఇలాగే విభిన్నంగా ఆలోచించింది. కార్లు, బస్సులు రొటీన్‌ అనుకున్నారో ఏమో...

Viral Video: పెళ్లి కోసం విమానాన్నే బుక్‌ చేసుకున్న జంట.. ఫ్లైట్‌లో నవ దంపతులతో బంధువర్గం సందడి..
Couple books entire flight for wedding
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2022 | 6:29 AM

పెళ్లి కోసం ఎవరైనా… కారో, బస్సో బుక్‌ చేసుకుంటారు. కానీ ఓ జంట ఏకంగా బోయింగ్‌ విమానాన్నే బుక్‌ చేసుకుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో ప్రత్యేకం. అందుకే, ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. లైఫ్‌లో ఒక్కసారే కదా పెళ్లి చేసుకునేదని కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తుంటారు. కొందరైతే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ చేసుకుంటారు. మరికొందరు గాల్లో తేలియాడుతూ, ఇంకొందరు సముద్ర గర్భంలోకెళ్లి పెళ్లాడుతుంటారు. పెళ్లిని డిఫరెంట్‌గా చేసుకోవడమే కాదు, అతిథుల కోసం స్పెషల్‌ అరేంజ్‌మెంట్స్‌ కూడా చేస్తుంటారు. రాజస్థాన్‌లో ఓ జంట ఇలాగే విభిన్నంగా ఆలోచించింది. కార్లు, బస్సులు రొటీన్‌ అనుకున్నారో ఏమో… పెళ్లి బృందం కోసం ఏకంగా విమానాన్నే బుక్‌ చేశారు వధూవరులు. ఆ ఫ్లైట్‌లో బంధువర్గమంతా కలిసి సందడి చేస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అతిథులతోపాటు వధూవరులు కూడా ఆ విమానంలోనే ప్రయాణించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విమానంలో ప్రయాణిస్తూ కేరింతలు కొట్టారు అతిథులు. కారులోనో, బస్సులోనే ప్రయాణిస్తున్నట్లుగా అరుపులు కేకలు వేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియోను ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ట్రెండింగ్‌ అవుతోంది. అయితే, ఈ జంటపై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు పాజిటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా, డిఫరెంట్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరులు మాత్రం సక్సెస్‌ అయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..