- Telugu News Photo Gallery World photos China Da Hong Pao tea leaves give worlds most expensive tea costing Rs 10 crore per kilo know reason
Da Hong Pao: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ .. కిలో తేయాకు 10 కోట్లు ధర .. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
డా హాంగ్ పావో టీ చైనాలో అత్యంత ప్రసిద్ధ టీ. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన తీయకుల్లో ఒకటి. ఈ చెట్ల పెంపకం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని అత్యంత శ్రమతో కూడుకున్నదని చెబుతున్నారు.
Updated on: Dec 03, 2022 | 2:57 PM

ప్రపంచంలో టీ ప్రేమికులు అధికంగానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. మంచి నీరు తర్వాత అధికంగా తాగేది టీ అని కొన్ని అధ్యాయాల ద్వారా తెలుస్తోంది. భారతీయులకు..టీకి విడదీయలేని బంధం ఏర్పడింది. బ్రిటిష్ వారికి అలవాటైన బ్లాక్ టీ.. భారతీయులు తమ సంప్రదాయాన్ని జోడించి అనేక రకాల టీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే భారతీయ దుకాణాల్లో కప్పు టీ ధర రూ. 10 నుండి రూ 20 లకు అందుబాటులో ఉంటుంది, అయితే స్టార్ హోటల్స్ -రెస్టారెంట్‌కి వెళితే.. అప్పుడు టీ రూ. 100 నుండి రూ. 1000 రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది.

అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ గురించి మీకు తెలుసా.. ఈ తేయాకు కిలో ధర వేలల్లో కాదు.. లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లలోనే ఉంటుంది. అత్యంత ఖరీదైన తీయకు మన పొరుగు దేశం చైనాలో దొరుకుతుంది. డ్రాగన్ కంట్రీలో మాత్రేమే కనిపించే డా హాంగ్ పావో టీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ. ఒక కిలో చాయ్ పత్తా కొనాలంటే.. మన దేశ కరెన్సీలో దాదాపు 10 కోట్ల ధర చెల్లించాలి.

సమాచారం ప్రకారం, చైనాలోని ఫుజియాన్‌లోని వుయిసాన్ ప్రాంతంలో మాత్రమే ఈ డా హాంగ్ పావో టీని సాగు చేస్తారు. ఈ టీ పండించే చెట్లు చాలా అరుదైనవి. వీటిని తల్లి చెట్లు అని కూడా పిలుస్తారు.

ఈ టీ చరిత్ర చాలా పురాతనమైనదని చైనీయులు చెబుతుంటారు. ఒకసారి మింగ్ పాలనలో.. రాణి అనారోగ్యం బారిన పడ్డారు. అప్పుడు వైద్యులు రానికి ఈ డా-హాంగ్ పావో టీ ఆకులతో తయారు చేసిన టీ ఇచ్చారు. టీ అద్భుతాలు చేసింది.. రాణి వ్యాధిని నయం చేసింది.

ఈ మొక్క చాలా అరుదు. దీనిని సంరక్షించుకోవడానికి చాలా కష్టపడాలి. ఈ తేయాకులతో తయారు చేసే టీ తాగడం వల్ల శరీరంలోని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి సులభంగా బయటపడవచ్చని చెబుతున్నారు. అంతేకాదు ఈ ఆకుల నుంచి ఔషధలను కూడా తయారు చేస్తున్నారు. కేవలం 6 చెట్లు మాత్రమే ఉన్నాయి.

ప్రస్తుతం చైనాలో 6 చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏడాది పొడవునా తక్కువ పరిమాణంలో ఈ టీ పొడి ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈ టీ ఆకులను చాలా మంది అన్ని కోట్లు ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.





























