Watch Video: ఒకే అబ్బాయిని వివాహమాడిన కవలలు.. కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ చేరిన స్టోరీ.. నెట్టింట్లో వైరల్ వీడియో..
Solapur Marriage: చిన్నప్పటి నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో ఇద్దరూ కలిసి జీవించాలని భావించారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఒక ప్రత్యేక వ్యక్తి వారి జీవితంలోకి ప్రవేశించాడు.
Solapur Marriage Video: మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందిన ఓ అపూర్వ వివాహానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ ఇద్దరు కవల సోదరీమణులు ఒకే యువకుడిని తమ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు. వారిద్దరూ అతనిని వివాహం చేసుకున్నారు. కవల సోదరీమణులు ఇద్దరూ వృత్తిరీత్యా ఐటీ ఇంజనీర్లు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాలో శుక్రవారం (డిసెంబర్ 2) వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఈ జోడీపై నెటిజన్ల ప్రశ్నల జల్లు..
ఈ ప్రత్యేకమైన పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ఇంటర్నెట్ వినియోగదారులు ఈ వివాహం చెల్లుబాటు అవుతుందా అనే ప్రశ్నను నిరంతరం అడుగుతున్నారు. కవల సోదరీమణులు పింకీ, రింకీ ముంబైలో కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు కవల సోదరీమణులు వివాహం చేసుకున్న అబ్బాయి పేరు అతుల్.
अकलूज तालुका माळशिरस येथे दोन जुळ्या बहिणींनी एकाच मुलाशी केला विवाह. कांदिवलीमधील उच्च शिक्षित पिंकी आणि रिंकी या जुळ्या बहिणी आहेत.#Solapur #Mumbai #Marriage #MaharashtraNews #News18Lokmat pic.twitter.com/s9uezTp6hz
— ROHAN GOHIL (@ROHANGOHIL) December 3, 2022
సోదరీమణులు ఇద్దరూ కలిసి ఉండాలనే కోరికతోనే..
చిన్నప్పటి నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారంట. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి జీవించాలని భావించారు. అప్పుడే వారి జీవితంలోకి అతుల్ మల్షీరాస్ ప్రవేశించాడు. అతుల్ మల్షిరాస్ తాలూకా నివాసి. ముంబైలో ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నాడు. బాలికల తండ్రి కొద్దిరోజుల క్రితమే మృతి చెందడంతో బాలికలు మల్షిరాస్ తాలూకాలో తల్లితో కలిసి జీవించడం ప్రారంభించారు.
ఒకసారి రింకీ, పింకీల తల్లి అనారోగ్యం పాలైనప్పుడు ఇద్దరూ అతుల్ కారులోనే తమ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతలో అతుల్ ఇద్దరు కవలకు నచ్చడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి విషయంలో పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి, పలు చర్యలు తీసుకునేందుక సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..