Gold Price Today: పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే..
అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారానికి డిమాండ్ మరింత పెరిగింది. చాలా మంది తక్కువో, ఎక్కువో బంగారం కొంటుంటారు. పండుగలు, పెళ్లిళ్ల సమయంలోనే బంగారు దుకాణాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. అయితే బంగారం ధరలు..
అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారానికి డిమాండ్ మరింత పెరిగింది. చాలా మంది తక్కువో, ఎక్కువో బంగారం కొంటుంటారు. పండుగలు, పెళ్లిళ్ల సమయంలోనే బంగారు దుకాణాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. అయితే బంగారం ధరలు స్థిరంగా ఉండవు. హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు. మహిళలు అత్యంత ఇష్టపడే వాటిలో బంగారం ఒకటి. తాజాగా డిసెంబర్ 5వ తేదీ ధరలతో పోలిస్తే 6వ తేదీన దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కన్పించింది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,040 వద్ద నమోదైంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.54,110 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.49,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,260 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.49,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,160 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,110 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,110గా ఉంది.
వెండి ధర
చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500, ముంబైలో రూ.66,500, ఢిల్లీలో రూ.66,500, కోల్‌కతాలో కిలో వెండి రూ.72,500, బెంగళూరులో రూ.72,500, హైదరాబాద్‌లో రూ.72,500, విశాఖలో రూ.72,500 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..