AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: భవిష్యత్తుల్లో బంగారం, వెండి ధరలు మరింత భారం కానున్నాయా.. కారణాలు ఇవే..

ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వారంలో ఒకటి రెండు సార్లు తగ్గినా.. ఆ తగ్గింపు స్వల్పంగా మాత్రమే ఉంటుంది. పెరిగేటప్పడు ఎక్కువ.. తగ్గేటప్పుడు తక్కువ తగ్గడం సాధారణంగా బంగారం, వెండి...

Gold: భవిష్యత్తుల్లో బంగారం, వెండి ధరలు మరింత భారం కానున్నాయా.. కారణాలు ఇవే..
Gold
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 05, 2022 | 8:27 PM

ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వారంలో ఒకటి రెండు సార్లు తగ్గినా.. ఆ తగ్గింపు స్వల్పంగా మాత్రమే ఉంటుంది. పెరిగేటప్పడు ఎక్కువ.. తగ్గేటప్పుడు తక్కువ తగ్గడం సాధారణంగా బంగారం, వెండి ధరల్లో చూస్తుంటాం. గత నెల రోజులుగా భారత మార్కెట్‌లో బంగారం ధరలు రూ.3,500కు పైగా పెరిగాయి. నవంబర్ 1న బంగారం ధర పది గ్రాములు రూ.50,300 కంటే తక్కువగా ఉండగా.. డిసెంబర్ 1న బంగారం ధర రూ.53,900కి చేరింది. ఈ సమయంలో, గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 11 శాతం పెరిగింది. వెండి ధర కూడా ఇదే స్థాయిలో పెరుగుదలను సూచించింది. దీనిని బట్టి చూస్తే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం ధరల తగ్గుదల, పెరుగుదలను అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. అమెరికాలో ద్రవ్యోల్పణ పరిస్థితుల నేపథ్యంలో.. రాబోయే కాలంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్‌లో వివాహ ముహుర్తాలు ప్రారంభం అయ్యాయి. జనవరి తర్వాత మరిన్ని ముహుర్తాలు ఉన్నాయి. దీంతో శుభకార్యాలకు, పెళ్లిళ్లకు బంగారం, వెండి వస్తువులు కొనడం ఆనవాయితీ. దీంతో చాలా మంది బంగారం, వెండి ధరలు తగ్గితే.. కొనుగోలు చేద్దామని చూస్తూ ఉంటారు. కాని.. బంగారం ధరలు పెరుగుతూ ఉండటంతో.. తగ్గుతాయనే ఎదురుచూసే వ్యక్తులు నిరాశకు గురికావడం సర్వ సాధారణం.

ప్రధానంగా వివాహల సమయంలో బంగారం, వెండికి డిమాండ్ అధికంగా ఉంటుంది. పండుగలు, వివాహ ముహుర్తాల సమయంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనుక.. భవిష్యత్తులో బంగారం, వెండి కొనుగోలు మరింత భారం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా..!
హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా..!
సోలార్‌తో ఏసీని నడపవచ్చా? ఎంత కెపాసిటీకి ఎన్ని ప్యానెల్స్‌ అవసరం
సోలార్‌తో ఏసీని నడపవచ్చా? ఎంత కెపాసిటీకి ఎన్ని ప్యానెల్స్‌ అవసరం
తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫీచర్లు ఈ స్మార్ట్‌వాచ్‌ల సొంతం
తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫీచర్లు ఈ స్మార్ట్‌వాచ్‌ల సొంతం
ఈ కుమారి కౌగిట నలిగిన ఆ చీరది ఏనాటి పుణ్యమో.. ఫ్యాబులస్ అనుక్రీతి
ఈ కుమారి కౌగిట నలిగిన ఆ చీరది ఏనాటి పుణ్యమో.. ఫ్యాబులస్ అనుక్రీతి
2064లో ఏం జరగనుంది? భయపెట్టిస్తోన్న కలియుగం సినిమా ట్రైలర్
2064లో ఏం జరగనుంది? భయపెట్టిస్తోన్న కలియుగం సినిమా ట్రైలర్
'క్యా ఆద్మీ హై!' ధోనికి ఫిదా అయిన బాలివుడ్ బ్యూటీ
'క్యా ఆద్మీ హై!' ధోనికి ఫిదా అయిన బాలివుడ్ బ్యూటీ
కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సమర్థిస్తాంః రాహుల్
కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సమర్థిస్తాంః రాహుల్
నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
నిత్యం తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. కట్‌చేస్తే..
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్.. వెంటనే కొని తెచ్చుకున్నాడు.. తర్వాత
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!
మీ జీమెయిల్‌పై హ్యాకర్ల దృష్టి.. యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక..!