Gram Suraksha Yojana: ఈ పథకంలో మీరు రోజుకు రూ.50 పెడితే.. తిరిగి ఎంత పొందుతారంటే? మీరు ఊహించి కూడా ఉండనంత..
పెట్టుబడి పెట్టడం, పొదుపు చేయడం కోసం పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టే పథకాలను ఉపయోగించడం చాలా మంచి మార్గం. ఈ పొదుపు పథకాలు పూర్తిగా రిస్క్ లేనివి, మంచి రాబడిని కూడా అందించేవిగా ఉంటాయి. పోస్టాఫీసు..

Grama Suraksha Yojana
పెట్టుబడి పెట్టడం, పొదుపు చేయడం కోసం పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టే పథకాలను ఉపయోగించడం చాలా మంచి మార్గం. ఈ పొదుపు పథకాలు పూర్తిగా రిస్క్ లేనివి, మంచి రాబడిని కూడా అందించేవిగా ఉంటాయి. పోస్టాఫీసు గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్రోగ్రామ్ కింద అనేక పథకాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. వాటిలో గ్రామ సురక్ష యోజన కూడా ఒకటి.
ఈ గ్రామ సురక్ష యోజన పథకం కోసం మీరు రోజుకు 50 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. దాదాపు 35 లక్షల రూపాయల రాబడిని మీరు పొందవచ్చు. అంటే ఈ పథకంలో నెలకు రూ.1500 డిపాజిట్ చేయడం ద్వారా రూ.35 లక్షలు పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.
నియమాలు తెలుసుకోండి:
ఇవి కూడా చదవండి

Bad Eating Habits: ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండడానికి ఈ 5 చెడు ఆహారపు అలవాట్లను మానివేయడం మంచిది.. అవేమింటంటే..?

6 seater E-bike: కేవలం పదివేలతోనే 6 సీటర్ ఎలక్ట్రిక్ బైకును తయారు చేసిన అసద్.. ప్రశంసించిన ఆనంద్ మహింద్రా..

Late Night Eating: రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే దాని వల్ల కలిగే సమస్యలేమిటో తెలుసా..? ఆ వివరాలు మీ కోసమే..

Watch Video: ‘నన్ను కొడితే నేను ఊరుకుంటానా..?’ అంటూ కుర్రాడి వెంటపడుతున్న గజరాజు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..
- గ్రామ సురక్ష యోజన పథకం ద్వారా పెట్టుబడిదారుడు 80 సంవత్సరాల వయస్సులో బోనస్‌తో పాటు, లభించే పెద్ద మొత్తాన్ని పొందుతారు. ఈ సమయానికి ముందుగానే పెట్టుబడిదారుడు మరణించినట్లయితే ప్రభుత్వం నుంచి నామినీగా ఉన్న వ్యక్తి ఈ మొత్తాన్ని అందుకుంటారు.
- 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సు గల భారత పౌరులు ఎవరైనా విలేజ్ సెక్యూరిటీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకోసం వారు కనీసం రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రీమియం చెల్లించడానికి అనేక ఎంపికలు కూడా ఉన్నాయి. పెట్టుబడిదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన వాయిదాలను చెల్లించవచ్చు.
- మీకు లోన్ అవసరమైనట్లయితే నాలుగు సంవత్సరాల తర్వాతే లభిస్తుంది. లోన్ తీసుకున్నట్లయితే పాలసీ వ్యవధిలో ప్రీమియం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే, మీరు పెండింగ్‌లో ఉన్న ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం ద్వారా దాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి




