AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ‘నన్ను కొడితే నేను ఊరుకుంటానా..?’ అంటూ కుర్రాడి వెంటపడుతున్న గజరాజు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..

అనువు కాని చోట అధికులం అనకూడదని పెద్దలు ఊరికే చెప్పలేదు. వారికి ఎంతో అనుభవం ఉంటేనే ఈ మాట చెప్పగలిగారు. అందుకే పెద్దల మాటలను సదా పాటించాలి. లేకపోతే ప్రస్తుతం వైరల్ అవుతున్న..

Watch Video: 'నన్ను కొడితే నేను ఊరుకుంటానా..?' అంటూ కుర్రాడి వెంటపడుతున్న గజరాజు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..
Elephant Chasing The Boy
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 05, 2022 | 4:44 PM

Share

అనువు కాని చోట అధికులం అనకూడదని పెద్దలు ఊరికే చెప్పలేదు. వారికి ఎంతో అనుభవం ఉంటేనే ఈ మాట చెప్పగలిగారు. అందుకే పెద్దల మాటలను సదా పాటించాలి. లేకపోతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో లాగానే జరుగుతుంది. అడవి జంతువులను మనం ఏమి చేయకుండా ఉండడం మనకే మంచిది. కానీ వాటిని ఏమైనా చేస్తే మనల్ని పరిగెత్తించకుండా వదిలిపెట్టవు. అలాంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ ఆడుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు ఎనుగుల గుంపులోని ఓ ఏనుగును కర్రతో కొట్టాడు.

వెంటనే ఆ ఏనుగు అతని వెంట పడింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా ట్వీట్ చేశారు.  ఇంకా దానికి ‘కేవలం పిచ్చితనమే’ అని కాప్షన్ రాసుకోచ్చారు ఆయన. దాంతో నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఆ కుర్రాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే 14000 మందికి పైగా నెటిజన్లకు చేరిన ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ తీశారో ఇంకా తెలియరాలేదు. కామెంట్ రూపంలో నెటిజన్లు అటవీ శాఖపై, ఆ యువకుడిపై నిప్పులు చెరుగుతున్నారు. ‘అటవీ శాఖాధికారులు ఏం చేస్తున్నార’ని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఏనుగులే స్వయంగా మనుషులపై దాడి చేయవనేదానికి ఈ వీడియోనే సాక్ష్యం అని మరో వ్యక్తి అన్నాడు. ఇలా వీడియోను చూసినవారు వారివారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..