Air Purifier Plants: స్వచ్ఛమైన గాలిని పీల్చాలనుకుంటున్నారా..? అయితే ఈ మొక్కలను ఇంట్లో ఉంచితే సరి.. అవేమిటో తెలుసుకోండి..

పర్యావరణాన్ని మెరుగుపరచడంలో మొక్కలు,చెట్లు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మానవజాతి వాటికి హాని కలిగించే ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ, అవి మేలు చేస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో వాయుకాలుష్యం..

Air Purifier Plants: స్వచ్ఛమైన గాలిని పీల్చాలనుకుంటున్నారా..? అయితే ఈ మొక్కలను ఇంట్లో ఉంచితే సరి.. అవేమిటో తెలుసుకోండి..
Air Purification Plants
Follow us

|

Updated on: Dec 05, 2022 | 3:43 PM

పర్యావరణాన్ని మెరుగుపరచడంలో మొక్కలు,చెట్లు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మానవజాతి వాటికి హాని కలిగించే ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ, అవి మేలు చేస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో వాయుకాలుష్యం పెరిగిపోవడానికి చెట్లను నరికివేయడమే కారణం. నిత్యం పెరుగుతున్న వాయికాలుష్యం కారణంగా.. ఎయిర్ ప్యూరిఫైయర్ల అవసరం కూడా అధికమవుతోంది. మరి ఎయిర్ ప్యూరిఫికేషన్ చేసే సహజమైన మొక్కల గురించి తెలుసుకుందామా..? ఈ మొక్కలను ఇంట్లో ఉంచడం ద్వారా ఎలక్ట్రికల్ ఎయిర్ ప్యూరిఫైయర్ల కంటే మేలైన రీతిలో పనిచేసి, స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తాయి.

ఈ మొక్కలను ఇంట్లో  నాటితే.. ఎయిర్ ప్యూరిఫయర్ల అవసరం ఉండదు.

పీస్ లిల్లీ: పీస్ లిల్లీ సహజమైన గాలి శుద్ధికరణ మొక్క. ఈ మొక్కను నాటిన తర్వాత దాని కోసం  మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అది వాతావరణంలోని సూర్యకాంతిని ఇంట్లోని తేమను గ్రహిస్తుంది. తద్వారా మీకు శ్రమ తగ్గినట్లే కదా..

అయితే ఒక అధ్యయనం ప్రకారం.. ఇది ఇంట్లో సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఈ మొక్క కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విషపూరిత సమ్మేళనాలను ఇంట్లోని గాలి నుంచి తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

జాడే మొక్క: జాడే మొక్క అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది అలంకరణతో పాటు మానవులకు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి నిద్ర పొందడానికి కూడా సహాయపడుతుంది. ఇది ఇండోర్ తేమను పెంచుతుంది ఇంకా దుమ్ము వంటి అలెర్జీని కలిగించే కణాలతో పోరాడి మనల్ని రక్షిస్తుంది.

మనీ ప్లాంట్: సంపద,  శ్రేయస్సు చిహ్నంగా ప్రజలు మనీ ప్లాంట్‌ను నాటుతారు. అయితే ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మనీ ప్లాంట్ కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన కాలుష్య కారకాలను పీల్చుకోవడం ద్వారా గాలిని శుద్ధి చేస్తుంది.

స్నేక్ ప్లాంట్: ఇది ఇంట్లోని గాలిని శుద్ధి చేసి అలర్జీలను నివారిస్తుంది. బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి క్యాన్సర్ కారక కారకాలను దూరంగా ఉంచడంలో స్నేక్ ప్లాంట్ సహాయపడుతుంది.

అరటి మొక్క: చూడడానికి అందంగా కనిపించే అరటి మొక్కలో అనేక ఔషధ ప్రయోజనాలున్నాయి. ఇది ఉంటే ఇంట్లోని గాలిని శుభ్రపరుస్తుంది. గాలిలోని హానికరమైన కణాలను గ్రహించి సహజమైన శుద్ధికరణ మొక్కగా పనిచేస్తుంది.

కలబంద మొక్క: కలబంద మొక్క హానికరమైన వాయువును తొలగించడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు. ఎయిర్ ప్యూరిఫైయర్ గానే కాక మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి..

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!