AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పులి పిల్లతో కలిసి కోతి పిల్ల ఏంచేసిందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..

సహజంగానే మనుషుల కంటే జంతువులు ఎక్కువగా ఆటాడడంలో నిమగ్నమై ఉంటాయి. ముఖ్యంగా ఒక జాతి జంతువులు ఇతర జంతువులతో ఆడడానికి చాలా ఆసక్తిని కనబరుస్తాయి.  అలా మన చుట్టూ ..

Watch Video: పులి పిల్లతో కలిసి కోతి పిల్ల ఏంచేసిందో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..
Tiger Cub And Baby Monkey
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 05, 2022 | 4:17 PM

Share

సహజంగానే మనుషుల కంటే జంతువులు ఎక్కువగా ఆటాడడంలో నిమగ్నమై ఉంటాయి. ముఖ్యంగా ఒక జాతి జంతువులు ఇతర జంతువులతో ఆడడానికి చాలా ఆసక్తిని కనబరుస్తాయి.  అలా మన చుట్టూ పక్కల అనేక సందర్భాలను చూసే ఉంటాం. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే మీరు ఇది నిజమేనా అని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఈ వైరల్ వీడియోలో ఆడుకుంటున్నవి కుక్క-పిల్లి లేదా పిల్లి-ఎలుక కాదు.. ఒక కోతి పిల్లతో పులి పిల్లతో ఆడుకుంటోంది. ఈ వీడియో చూడడానికి చాలా ఫన్నీగా ఉండడమే కాక నమ్మశక్యం కానిదిగా ఉంది. ‘నేను పులి’ని అన్న అహంకారం ఈ పులి పిల్లలో లేనేలేదు.

‘నేను కోతి”ని కనుక చెట్ల మీద ఎగరాలనే భావన ఆ కోతి పిల్లలో కూడా లేదు. తమను తాము మరిచి ఆడుతున్నప్పుడే కదా ఆటకు ప్రాముఖ్యత లభిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘టైగర్ వీడియో’ ఖాతా నుంచి ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 3,000 మందికి పైగా చూశారు. ఇంకా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ చేస్తున్నారు. ‘ఇది చాలా ప్రత్యేకమైన, విలువైన వీడియో’ అని ఓ నెటిజన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

‘ఈ వీడియో హాయిని ఇస్తుందో..దాన్ని మాటల్లో వర్ణించలేమ’నిమరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఇలాంటి వీడియోనే ఇటీవలి కాలంలో వైరల్ అయింది. ఆ వీడియోలో పులి పిల్లలతో గొరిల్లా పిల్ల ఆడుకుంటూ ఉంటుంది. కుక్క పిల్లికి పాలు ఇస్తున్న వీడియో కూడా అంతక ముందు వైరల్ అయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..