AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి దేవుడో.. ఇదేం ఏటీఎం రా బాబోయ్ .. కార్డు పెట్టగానే గుట్టంతా రట్టు..

డబ్బుల కోసం ఏటీఎం కు వెళ్లడం కామన్. గోల్డ్ ఇచ్చే ఏటీఎం లు ఇప్పుడిప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపుగా చాలా మంది ఏటీఎం కు డబ్బులు డ్రా చేసుకోడానికే వెళ్తారు. మనకు కావలసిన డబ్బు...

Viral Video: ఓరి దేవుడో.. ఇదేం ఏటీఎం రా బాబోయ్ .. కార్డు పెట్టగానే గుట్టంతా రట్టు..
Atm Video Viral
Ganesh Mudavath
|

Updated on: Dec 05, 2022 | 3:18 PM

Share

డబ్బుల కోసం ఏటీఎం కు వెళ్లడం కామన్. గోల్డ్ ఇచ్చే ఏటీఎం లు ఇప్పుడిప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపుగా చాలా మంది ఏటీఎం కు డబ్బులు డ్రా చేసుకోడానికే వెళ్తారు. మనకు కావలసిన డబ్బు డ్రా చేసుకున్న తర్వాత ఇతరులు మన అకౌంట్‌ వివరాలు తెలుసుకొని డబ్బులు కాజేస్తారేమోనన్న అనుమానంతో ట్రాన్సాక్షన్‌ ముగిసిన వెంటనే క్యాన్సిల్‌ లేదా ఏవో నెంబర్లు నొక్కి బయటకు వచ్చేస్తాం. అంటే, బ్యాంకు బ్యాలెన్స్‌ గానీ, ఇతర వివరాలు గానీ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడతాం. కానీ, అమెరికాలో మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం మాత్రం కస్టమర్ల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి దానిలో కార్డు పెట్టి ఎదురుగా నిల్చుంటే చాలు.. కస్టమర్‌ ఫొటో తీసి.. అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్‌ ఉందో ఏటీఎం పైన ఏర్పాటు చేసిన లీడర్‌ బోర్డుపై అందరికీ కనిపించేలా డిస్‌ప్లే అవుతోంది. బ్యాలెన్స్‌ పక్కనే కస్టమర్‌ ఫొటో కూడా ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ బ్యాలెన్స్‌ ఉన్న కస్టమర్‌ పేరు మొదటి స్థానంలో ఉండి.. ఆ తర్వాత బ్యాలెన్స్‌ వారీగా కస్టమర్ల పేర్లనూ చూపిస్తోంది.

ఈ ఏటీఎంను న్యూయార్క్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సీహెచ్‌ఎఫ్‌ సంస్థతో కలిసి పెర్రోటిన్‌గ్యాలరీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. దీనిని మియామీ బీచ్‌లోని ఆర్ట్‌ గ్యాలరీలో ఉంచారు. సాధారణ ఏటీఎంలో లాగానే ఇందులోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చట. వెరైటీగా ఉన్న ఈ ఏటీఎంకి జనాలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఏటీఎంలో కార్డు పెట్టి.. ముఖం కనిపించకుండా కవర్‌ చేస్తే‘ డబ్బులు డ్రా చేయడానికి ట్రై చేశారు.

ఇవి కూడా చదవండి

అ సమయంలో BYE, Bloody Boys’ అంటూ సందేశం డిస్‌ప్లే అవుతోంది. దీనిని చూసుకొని వారంతా నవ్వుకుంటూ పక్కకి వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను జోయల్‌ ఫ్రాంకో అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసారు. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి