Shopping Tips: షాపింగ్ చేశాక.. ఎక్కువ ఖర్చు పెట్టేశామని బాధపడుతున్నారా.. ఇలా చేస్తే తప్పకుండా వృధా వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.

నేటి కాలంలో షాపింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అయిపోయింది. ఎవరికి వారు తమ స్థోమతను బట్టి షాపింగ్ చేస్తుంటారు. అధిక ఆదాయం ఉన్నవాళ్లతో పోలిస్తే షాపింగ్ సమయంలో మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు..

Shopping Tips: షాపింగ్ చేశాక.. ఎక్కువ ఖర్చు పెట్టేశామని బాధపడుతున్నారా.. ఇలా చేస్తే తప్పకుండా వృధా వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.
Shooping In Mall (Representative Image)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 05, 2022 | 8:20 PM

నేటి కాలంలో షాపింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అయిపోయింది. ఎవరికి వారు తమ స్థోమతను బట్టి షాపింగ్ చేస్తుంటారు. అధిక ఆదాయం ఉన్నవాళ్లతో పోలిస్తే షాపింగ్ సమయంలో మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ప్లాన్ లేకుండా షాపింగ్‌కు వెళ్లడం, ఆ తర్వాత.. మాల్స్‌లో అనేక వస్తువులకు ఆకర్షితులవడం, కొన్ని సందర్భాల్లో వస్తువులను కొనలేకపోవడం, మరికొన్ని సందర్భాల్లో ఆకర్షించే అన్ని వస్తువులను కొని.. బిల్లు చూసి బాధపడటం వంటివి సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువుగా చూస్తూ ఉంటాం. అసలు ధనవంతులైనా, పేద, మధ్యతరగతి.. ఇలా ఏ వర్గానికి చెందినవారైనా.. తమ షాపింగ్‌ను ప్రోపర్‌గా ప్లాన్ చేసుకుంటే.. వృధా ఖర్చును తగ్గించుకోవచ్చు. ఓ అధ్యయనం ప్రకారం సాధారణంగా షాపింగ్‌కు వెళ్లేవారిలో అధికశాతం మంది తమకు కావల్సిన వస్తువులకంటే ప్రస్తుతం అంతగా అవసరం లేని వస్తువలపైనే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి.. షాపింగ్‌ను ప్రొపర్‌గా ప్లాన్ చేసుకున్నవారికి అయ్యే ఖర్చు చాలా తక్కువ అయినట్లు తెలింది.

ముందుగా లిస్ట్ తయారు చేసుకోండి

షాపింగ్‌కు వెళ్లే ముందుగా అసలు ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువుల అవసరమో ఒక లిస్ట్ తయారుచేసుకోవాలి. ఇలా చేయడం వలన మన ఫోకస్ ముందుగా మనకు అవసరమైన వస్తువుల వైపే మళ్లుతుంది. మరోవైపు మన ఇంట్లో ఉండే వస్తువులనే మరోసారి షాపింగ్‌ బాస్కెట్‌లో వేసుకుంటే అనవసర ఖర్చు పెరుగుతుంది.

తక్కువగా కొనాలనుకునేవాటివైపు ముందుగా ఎంచుకోవాలి

ఏ వస్తువులు అయితే తక్కువ మోతాదులో కొనాలనుకుంటున్నామో వాటిని ముందుగా తీసుకుని బాస్కెట్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రోజెన్-ఫుడ్స్ సెక్షన్‌కు వెళ్లాలి, ఆ తర్వాత క్యాన్డ్ ఫుడ్ దగ్గరకు వెళ్లడం బెటర్. తాజా ఫుడ్స్ కంటే ఫ్రోజెన్ మీట్, చేపలు, కూరగాయలు ఎప్పుడూ ధర తక్కువే ఉంటాయి. తాజా ఫుడ్స్ కంటే ముందే ఫ్రోజెన్ సెక్షన్‌కు వెళ్తే కచ్చితంగా కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పదార్థాలను వేస్ట్ చేయకుండా

కొన్ని పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల అవి పాడైపోతాయి. దీంతో వాటిపై పెట్టిన ఖర్చు అనవసర ఖర్చు కిందకే వస్తుంది. అందుకే వస్తువులు పాడైపోకుండా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేసుకోవడం ద్వారా వాటిపై పెట్టిన ఖర్చును ఆదా చేసుకోవచ్చు.  పైన పేర్కొన్న సింపుల్ టిప్స్ పాటించడం వల్ల మన షాపింగ్ లో అనవసర ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..