ATM Cash Withdrawal Limit: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు
బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొన్ని మార్పులు కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటే మరికొన్ని అదనపు భారం మోపేలా ఉంటాయి..
బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. కొన్ని మార్పులు కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటే మరికొన్ని అదనపు భారం మోపేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంక్ తన కస్టమర్‌ల కోసం ఏటీఎం నగదు ఉపసంహరణ, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), ఈ-కామర్స్ లావాదేవీలను అనుమతించింది. లావాదేవీలో మార్పును ప్రకటించింది. రోజువారీ డెబిట్ కార్డ్ లావాదేవీ పరిమితి తక్షణమే అమలులోకి వచ్చింది. బ్యాంకు ద్వారా ఎలాంటి మార్పులు చేశారో చూద్దాం. క్లాసిక్ డెబిట్ కార్డుల కోసం రోజువారీ ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితిని 40,000 నుండి 75,000 రూపాయలకు పెంచారు. ఈ కార్డ్‌ల పీఓఎస్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 లక్ష నుండి రోజుకు రూ. 2,00,000కి పెంచుతారు. అలాగె ఎన్‌ఎఫ్‌సీ (కాంటాక్ట్‌లెస్) కోసం బ్యాంక్ మొత్తాన్ని పెంచలేదు. పరిమితి ఇప్పటికీ రూ.25,000గా నిర్ణయించబడింది. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు ఒక్కో సందర్భంలో రూ. 5000 వరకు, రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది.
కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కార్డ్ లావాదేవీలపై భద్రతను పెంచారు. జారీ చేయబడిన డిఫాల్ట్ కార్డ్ ఏటీఎంలు, పీఓఎస్‌లలో మాత్రమే గృహ వినియోగం కోసం ఉపయోగించవచ్చు. కార్డ్ జారీ సమయంలో అంతర్జాతీయ/ఆన్‌లైన్ (ఇ-కామర్స్) వినియోగం, కాంటాక్ట్‌లెస్ వినియోగం అనుమతించబడవు. కార్డ్‌ని ఛానెల్ వారీగా (ఏటీఎం, పీఓఎస్/ఈ-కామర్స్, డొమెస్టిక్/అంతర్జాతీయ, ఎన్‌ఎఫ్‌సీ యాక్టివేట్/డియాక్టివేట్ చేసే సదుపాయం కస్టమర్‌లకు అందించింది.
పీఎన్‌బీ డెబిట్ కార్డ్ లావాదేవీ:
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిలో మార్పును సిఫార్సు చేసింది. పీఎన్‌బీ వెబ్‌సైట్ ప్రకారం.. బ్యాంక్ అన్ని ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్‌లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌ల పరిమితిని పెంచబోతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ థర్డ్ పార్టీ వ్యాపారుల ద్వారా చేసే అద్దె చెల్లింపుల ఛార్జ్ నిబంధనలు మార్చింది. బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. థర్డ్ పార్టీ వ్యాపారుల ద్వారా చేసిన అద్దె చెల్లింపుల కోసం చేసే లావాదేవీ మొత్తంలో 1% ఛార్జీ విధించబడుతుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి