AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో తీపి కబురు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం

మీరు కేంద్ర ఉద్యోగి అయితే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతం గురించి ఓ శుభవార్త అందబోతోంది..

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో తీపి కబురు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం
Bank Interest Rate
Subhash Goud
|

Updated on: Dec 05, 2022 | 2:40 PM

Share

మీరు కేంద్ర ఉద్యోగి అయితే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతం గురించి ఓ శుభవార్త అందబోతోంది. నివేదికల ప్రకారం.. సెప్టెంబర్‌లో డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ ( డిఆర్ ) 4 శాతం పెరిగిన తర్వాత ప్రభుత్వం దానిని మరోసారి పెంచనున్నట్లు తెలుస్తోంది. మార్చి 2023లో ప్రభుత్వం డీఏ, డీఆర్‌లను 3-5 శాతం పెంచవచ్చు. ఇది కాకుండా ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో ఈ పెంపు జరిగితే కేంద్ర ఉద్యోగుల డీఏ 41 నుంచి 43 శాతానికి చేరుకుంటుంది. అంటే ఇప్పుడు ఉద్యోగుల జీతం పెరగనుంది. దీంతో పాటు 18 నెలల డీఏ బకాయిలు కూడా ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

దీపావళి, పండుగల సీజన్‌కు ముందు దేశంలోని 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో డీఏ, డీఆర్‌లను 4 శాతం పెంచింది. జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం పెంచిన తర్వాత డీఏ లేద డీఆర్‌ వరుసగా బేసిక్ పే లేదా పెన్షన్‌లో 38 శాతంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో 2022లో మార్చిలో డీఏ సవరించబడింది. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏ, డీఆర్‌లను సవరిస్తుంది.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డీఏ లభిస్తుంది. ప్రభుత్వం డీఏను 3 నుంచి 5 శాతం వరకు సవరిస్తే, డీఏ 41 నుంచి 43 శాతం మధ్య ఉంటుంది. ఒకరి జీతం రూ.50,000, అతని మూల వేతనం రూ. 20,000 అయితే అతనికి 38 శాతం ప్రకారం 7,600 డీఏ వస్తుంది. డీఏ 5 శాతం పెరిగితే జీతం రూ.8,600 అవుతుంది. అంటే జీతంలో రూ.1,000 పెరుగుదల ఉంటుంది. ఏటా రూ.12,000 పెరగవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫార్ములా 2006 సంవత్సరంలో మార్చబడింది:

అంతకుముందు 2022 సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం డీఏను 3 శాతం పెంచి 34 శాతానికి తీసుకుంది. 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డీఏ, డీఆర్‌ గణన సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీలలో అలవెన్సులను సవరిస్తుంది. దీని తరువాత, ద్రవ్యోల్బణం ప్రకారం డీఏ పెరుగుతుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం..

ఫిట్‌మెంట్ అంశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2016 నుంచి 2.57 రెట్లు ఇస్తున్నా 3.68 రెట్లు పెంచాలని కేంద్ర సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. గత సారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచినప్పుడు బేసిక్ జీతం రూ.6 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. ఈసారి కూడా పెంచితే బేసిక్‌ వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు చేరనుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి