AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: రైలు బుకింగ్ వెబ్‌సైట్‌ IRCTC పాస్‌వర్డ్‌ మర్చిపోయారా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఇంట్లో కూర్చొని ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటును ఈ వెబ్‌సైట్‌ కల్పించింది. పాస్‌వర్డ్‌, యూజర్‌నేమ్‌ సహాయంతో ఈ వెబ్‌సైట్‌లోకి ఎంటర్‌ కావాల్సి ఉంటుంది. అయితే..

Railway News: రైలు బుకింగ్ వెబ్‌సైట్‌ IRCTC పాస్‌వర్డ్‌ మర్చిపోయారా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..
IRCTC
Narender Vaitla
|

Updated on: Dec 05, 2022 | 7:35 AM

Share

రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఇంట్లో కూర్చొని ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటును ఈ వెబ్‌సైట్‌ కల్పించింది. పాస్‌వర్డ్‌, యూజర్‌నేమ్‌ సహాయంతో ఈ వెబ్‌సైట్‌లోకి ఎంటర్‌ కావాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సెట్‌ చేసిన పాస్‌వర్డ్‌ను మరిచిపోతుంటాం. దీంతో పాస్‌వర్డ్‌ను ఎలాం రిసెట్‌ చేసుకోవాలో తెలియక కొందరు తికమకపడుతుంటారు. కొన్ని సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వడం ద్వారా మీ IRCTC పాస్‌వర్డ్‌ను తిరిగి పొందొచ్చు. స్టెప్‌ బై స్టెప్ ప్రాసెస్‌ మీకోసం..

* ఇందుకోసం ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో రైట్ సైడ్‌ ఉంటే లాగిన్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* వెంటనే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఓ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. లాగిన్‌కు కింద ఉండే ‘పాస్‌వర్డ్‌ మర్చిపోయారా’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* అనంతరం రిజిస్ట్రేషన్‌ సమయంలో మీరు ఇచ్చిన ఇమెయిల్‌, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

* దీంతో ఐఆర్‌సీటీసీ మీ రిజిస్టర్డ్‌ మెయిల్‌కు మీ ఐడీతో పాటు ఓ పాస్‌వర్డ్‌ను అందిస్తుంది.

* అనంతరం ఆ వివరాలతో లాగిన్‌ అయితే సరి. ఇక ఐఆర్‌సీటీసీ ఇచ్చిన పాస్‌వర్డ్‌ స్థానంలో మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పాస్‌వర్డ్‌ విషయంలో ఇది తప్పనిసరి..

ఇక పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవడంలో కూడా కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌లో ఇంగ్లిష్‌ లెటర్స్‌ (ఒక క్యాపిటల్‌ లెటర్‌), అంకెలు, స్పెషల్‌ సింబల్స్‌ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకునే సమయంతో ‘పాస్‌వర్డ్‌ స్ట్రెంత్‌’ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల మీ అకౌంట్‌ సెక్యూర్‌గా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..