Gold Silver Rate Today: దూకుడు మీదున్న బంగారం ధరలకు బ్రేక్.. సోమవారం గోల్డ్ రేట్ ఎంత ఉందంటే..
దేశంలో పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వరుసగా 5 రోజుల పాటు బంగారం ధరలు దూకుడు మీదున్న విషయం తెలిసిందే. గడిచిన ఐదు రోజుల్లో తులం బంగారంపై ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది...
దేశంలో పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వరుసగా 5 రోజుల పాటు బంగారం ధరలు దూకుడు మీదున్న విషయం తెలిసిందే. గడిచిన ఐదు రోజుల్లో తులం బంగారంపై ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. అయితే దూకుడు మీదున్న బంగారం ధరలకు సోమవారం బ్రేక్ పడింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరల్లో మార్పులు కనిపించలేదు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయన్న దానిపై ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,600 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 54,100 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 49,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 53,950 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,160 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,720 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 49,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.53,950 వద్ద కొనసాగుతోంది.
* సోమవారం విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,450 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 53,950 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,500 గా వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,950 గా ఉంది.
వెండి ధరలు ఇలా ఉన్నాయి..
వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గడిచిన మూడు రోజులుగా భారీగా పెరిగిన సిల్వర్ రేట్స్‌కు సోమవారం బ్రేక్ పడింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో మార్పులు కనిపించలేదు. సోమవారం న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,200 కాగా, ముంబైలో రూ. 65,200 ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 71,600 వద్ద కొనసాగుతోంది.