AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Price: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గనున్న పెట్రోల్-డీజీల్ రేట్లు..!

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించనుందా? పెట్రోల్-డీజీల్ ధరలను భారీగా తగ్గించేందుకు రంగం సిద్ధమవుతోందా? అన్నీ అనుకుట్టే జరిగితే..

Fuel Price: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గనున్న పెట్రోల్-డీజీల్ రేట్లు..!
Fuel Price
Shiva Prajapati
|

Updated on: Dec 04, 2022 | 8:46 PM

Share

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించనుందా? పెట్రోల్-డీజీల్ ధరలను భారీగా తగ్గించేందుకు రంగం సిద్ధమవుతోందా? అన్నీ అనుకుట్టే జరిగితే ఆ సుముహూర్తం రేపే కానుందా? అంటే అవుననే సమాచారం వస్తోంది విశ్వసనీయ వర్గాల నుంచి. నిపుణులు సైతం ఇదే మాటలను నొక్కివక్కాణిస్తున్నారు. అంతర్జాతీయంగా పడిపోతున్న చమురు ధరలు.. మన దేశంలో ధర తగ్గుదలకు సూచికగా పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ లెవల్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గినప్పటికీ.. మన దేశంలో మాత్రం పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులు మన దేశ వాహనదారులకు భారీ ఊరటనిస్తాయంటున్నారు.

పెట్రోల్-డీజీల్ రేట్లు భారీగా తగ్గే అవకాశం..

చాలా రోజులుగా పెరగడమే తప్ప.. పెద్దగా తగ్గడం అన్న ప్రస్తావనే లేని పెట్రోల్, డీజీల్ ధరలు త్వరలో భారీగా తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ తగ్గింపు సుమారు 5 రూపాయల వరకు ఉండవచ్చు. ఈ నెల 8 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

భారీగా పతనమవుతున్న ముడి చమురు ధరలు..

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో కూడా ముడి చమురు ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. కొద్ది కాలంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్ల దిగువకు పడిపోయింది. 2022 మార్చి నెల నుంచి ఇప్పటి వరకు సుమారు 27 శాతం మేర ముడి చమురు ధరలు పతనమయ్యాయి. దీంతో భారతీయ చమురు కంపెనీలు కూడా నష్టాల నుంచి చాలా వరకు బయటపడ్డాయి. మరోవైపు రష్యా సైతం భారత్‌కు భారీ తగ్గుంపు ధరలో ముడి చమురును విక్రయిస్తోంది. దాదాపు 40 శాతం తగ్గింపుతో ముడి చమురును సరఫరా చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మొత్తంగా ఇవన్నీ ప్రస్తుతం వాహనదారులకు శుభ సూచకాలే అని చెప్పవచ్చు. మార్కెట్ వర్గాలు అనుకుట్టే జరిగితే పెట్రోల్ ధరలు తగ్గేందుకు ముహూర్తం ఈ సోమవారమే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..