Watch Video: అమ్మాయిలే కదా అని జోలికెళ్లారో.. ఆస్పత్రిలో బెడ్ కన్ఫామే.. దుమ్ము రేపుతున్న కడప ‘కత్తులు’..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Dec 03, 2022 | 7:43 PM

నేటి భారతంలో మగువ ముందడుగు వేయాలంటే తెగువ కూడా కావాలి. అది కావాలంటే కరాటే, కుంగ్‌ఫూ రాకపోయినా కర్ర సాము, కత్తి సాము వస్తే చాలు. ఆత్మస్థైర్యంతో, గుండెల నిండా ధైర్యంతో..

Watch Video: అమ్మాయిలే కదా అని జోలికెళ్లారో.. ఆస్పత్రిలో బెడ్ కన్ఫామే.. దుమ్ము రేపుతున్న కడప ‘కత్తులు’..
Karra Samu

నేటి భారతంలో మగువ ముందడుగు వేయాలంటే తెగువ కూడా కావాలి. అది కావాలంటే కరాటే, కుంగ్‌ఫూ రాకపోయినా కర్ర సాము, కత్తి సాము వస్తే చాలు. ఆత్మస్థైర్యంతో, గుండెల నిండా ధైర్యంతో అమ్మాయిలు అడుగు ముందుకు వేయచ్చు. కడప కుర్రాడు ఈ పనే చేస్తున్నాడు. అమ్మాయిలకు కర్రసాము, కత్తిసాము నేర్పించి పదండి ముందుకు అంటున్నాడు. కర్రసాము, కత్తిసాముతో కడప అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఆకాశం కూడా తమకు హద్దు కాదంటున్నారు.

ప్రాచీన కళలలో కర్ర సాము ఒకటి అనే విషయం మనందరికీ తెలిసిందే.. అంతరించిపోతున్న ఈ కళను భావితరాలకు అందించడంతో పాటు అమ్మాయిల్లో ఫిట్‌నెస్‌ను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదుకు కడపకు చెందిన జయచంద్ర నడుం బిగించాడు. ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగపడే కర్రసాము, కత్తిసాము విద్యలను ఆడపిల్లలకు నేర్పుతున్నాడు. ఎందరో అమ్మాయిలు సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోసం కర్రసాము, కత్తిసాము నేర్చుకుంటున్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. కర్ర సాముకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని, కర్రసాము శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం స్థలం ఇవ్వాలని జయచంద్ర కోరుతున్నాడు.

తమను తాము రక్షించుకోవడంతోపాటు శారీరకంగా కూడా దృఢంగా ఉండవచ్చని కర్రసాము నేర్చుకుంటున్న విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కర్ర సాము లాంటి విద్యలు నేర్చుకోవడం ఎంతో అవసరం అంటున్నారు విద్యార్థులు. కోచ్‌ జయచంద్ర దగ్గర కర్రసాము, కత్తి సాము నేర్చుకున్న కడప దిశ పోలీసుల టీమ్‌ ఇటీవల కాలంలో తమ సాహస విన్యాసాలతో అదరగొట్టింది.

ఇవి కూడా చదవండి

కర్రసాము, కత్తిసాము శిక్షణకు సంబంధించిన అనుమతులు ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, అఫిలియేషన్ సర్టిఫికెట్ ఉంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ పొందే అవకాశం ఉంటుందని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధికారులు చెబుతున్నారు. నేటి భారతంలో మగువలు ముందడుగు వేయాలంటే తెగువ చూపించాలి. దానికి అవసరమైన ఆత్మ విశ్వాసాన్ని ఈ కర్రసాము, కత్తిసాము అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu