Miracle: శివాలయంలో అర్థరాత్రి అద్భుతం.. బయటపడిన త్రినేత్రాలు.. వీడియో మీకోసం..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Dec 03, 2022 | 10:17 PM

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అద్భుతం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ శివాలయంలో మిరాకిల్ చోటు చేసుకుంది. ఆలయంలో మూడు నేత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

Miracle: శివాలయంలో అర్థరాత్రి అద్భుతం.. బయటపడిన త్రినేత్రాలు.. వీడియో మీకోసం..
Lord Shiva

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అద్భుతం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ శివాలయంలో మిరాకిల్ చోటు చేసుకుంది. ఆలయంలో మూడు నేత్రాలు ప్రత్యక్షమయ్యాయి. దాంతో భక్తులు ఆ వెండి నేత్రాలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుడి మహిమ అంటూ భక్తిపారవశ్యంతో ఆ నేత్రాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో శ్రీభమరాంబ సహిత నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. నిన్న రాత్రి ఆలయంలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు వెండి నేత్రాలు కనిపించాయి.

స్థానికుడైన హుస్సేన్ అనే యువకుడికి 14 రోజులుగా దేవుని కళ్లు దేవాలయంలో ఉన్నట్లు కలలు వస్తున్నాయట. గుడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వెనుక ఈ త్రినేత్రాలు ఉన్నట్లు కలలో కనిపించాయట. ఇదే విషయాన్ని ఆలయంలో నిద్రిస్తున్న అయ్యప్ప స్వాములకు తెలిపాడు హుస్సేన్. అంతేకాదు.. పక్కనే ఉన్న పాలేరు నుంచి బిందెలతో శిశుడికి అభిషేకం చేసి స్వామి నేత్రాలు ఇక్కడే ఉన్నాయంటూ గుడిలోని ఓ ప్రాంతాన్ని చూపించాడు.

దాంతో ఆ ప్రాంతంలో తవ్వి వెతకగా.. వెండితో చేసిన మూడు నేత్రాలు కనిపించాయి. అది చూసి అయ్యప్ప స్వాములు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా పరమశివుడి లీలే అని అంటున్నారు భక్తులు. ఆ నేత్రాలను గుడిలో పెట్టి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. కాగా, ఆలయంలో లభించిన మూడు వెండి నేత్రాలను తిలకించేందుకు గ్రామస్తులే కాకుండా, సమీప గ్రామాల ప్రజలు కూడా తరలి వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu